
భారత్ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా రెండ్రోజుల పాటు జరిగిన బ్రిక్స్ సదస్సు గ్రాండ్‌గా ముగిసింది. అనుకున్న దానికంటే గ్రాండ్ సక్సెస్సయ్యి… ప్రపంచానికి ఓ గట్టి సందేశాన్ని పంపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడటంలో పెద్దన్న పాత్ర పోషించిన భారత్… ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమతుల్యాన్ని సాధించాలనే ప్రయత్నంలో దీన్నో ఉపయోగకర వేదికగా మారింది. పశ్చిమ దేశాల ఆధిపత్యానికి కళ్ళెం వేసేలా బ్రిక్స్ సదస్సుకు ప్రపంచ కీలకనేతలను రప్పించడంలో సఫలమైంది. న్యూఢిల్లీ డిక్లరేషన్‌తో వైట్ హౌజ్ కు బలమైన సందేశాన్ని పంపింది. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల కోసం గళం విప్పిన బ్రిక్స్ దేశాలు.. అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించే దిశగా మరింత బలంగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. సరిహద్దు ఉగ్రవాదం, మనీలాండరింగ్, సైబర్ భద్రత, ప్రాంతీయ భద్రత అంశాలపై సభ్య దేశాల మధ్య సమాచార మార్పిడి, ఉమ్మడి వ్యూహాల రూపకల్పనకు కలిసి పనిచేయాలని బ్రిక్స్ వేదిక నిర్ణయించింది.





