
Vintage Vibes : ఇప్పుడు ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా, డీపీ చూసినా 1980 కాలం నాటి ఫొటోలే కనిపిస్తున్నాయి. ఆ రోజుల్లో తాము ఎలా ఉండేవాళ్లమో చూసుకొని తెగ మురిసిపోతున్నారంతా. సినిమా స్టార్లు, సెలబ్రిటీలు, సామన్య ప్రజలే కాదండోయ్.. భారత క్రికెటర్లు సైతం ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. టీ20 సారథి శ్రేయాస్ అయ్యర్, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ నుంచి.. యువకెరటం వైభవ్ సూర్యవంశీలు తమ వ అఫ్గనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన స్క్వాడ్‌లోని సభ్యులు తమ ఫొటోలకు వింటేజ్ లుక్ ఇచ్చి థ్రిల్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఈమధ్య ట్రెండీగా మారిన 1980 లుక్ ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. ప్రతిఒక్కరు తమ ఫొటోలు అప్లోడ్ చేసి అప్పట్లో తాము ఎలా ఉండేవాళ్లమో చూసి సంబురపడిపోతున్నారు. భారత క్రికెటర్లు సైతం ఈ ట్రెండ్‌ను అనుసరించారు. అఫ్గనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు సరదాగా 1980 కాలంలోకి వెళ్లిపోయారు.
Vintage vibes. Priceless reactions. 😂
🎥 #TeamIndia takes on the 1980s trend 😉 – By @RajalArora #AFGvIND pic.twitter.com/nSaClHHdyn
— BCCI (@BCCI) September 12, 2026
తమ ఫొటోలను అప్లోడ్ చేసి.. అప్పట్లో తమ రూపాన్ని చూసుకొని వామ్.. నేను ఇలా ఉంటానా? అని ఒకింత షాకయ్యారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీవ్ రెడ్డిలు ‘ఈ ట్రెండ్ భలేగుంది’ అని మురిసిపోయారు. టీమిండియా సభ్యుల ఈ సందడిని వీడియో తీసి.. ఎక్స్‌లో పంచుకుంది బీసీసీఐ. భారత్, అఫ్గనిస్థాన్ మధ్య ఆదివారం తొలి టీ20 జరుగనుంది.
భారత స్క్వాడ్ : శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), శివం దూబే, నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్, సుందర్, బుమ్రా, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్.






