
సాధారణంగా ఒక డెబ్యూ హీరోయిన్ రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది.. మహా అయితే 10 లక్షలు.. బాగా స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ అయితే ఒక 50 లక్షలు. కానీ, ఒక హీరోయిన్ తన మొదటి సినిమాకే ఒక కోటి అందుకున్నదట. సాధారణంగా ఒక డెబ్యూ హీరోయిన్ రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది.. మహా అయితే 10 లక్షలు.. బాగా స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ అయితే ఒక 50 లక్షలు. కానీ, ఒక హీరోయిన్ తన మొదటి సినిమాకే ఒక కోటి అందుకున్నదట. ఏంటి.. నిజమా.. ఎవరా హీరోయిన్ అంటే.. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ రవీనా టాండన్ గారాల పట్టి రషా తడానీ (Rasha Thadani). సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని (Jayakrishna Ghattamaneni) హీరోగా పరిచయమవుతున్న తాజా చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాను సీనియర్ ప్రొడ్యూసర్ సి. అశ్విని దత్ సమర్పణలో పి. కిరణ్ (జెమిని కిరణ్) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతోనే రషా తెలుగుకు పరిచయం కానుంది. ఇప్పటికే శ్రీనివాస మంగాపురం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగుదనం ఉట్టిపడుతోన్న సినిమాలో అచ్చ తెలుగు అందంగా రషా కనిపించింది కానీ, కొంతమంది ఆమె మంగా పాత్రకు సెట్ కాలేదని పెదవి విరిచారు. ఆ పాత్రకు ఎవరు దొరకన్నట్లు ఈ ముంబై భామను అజయ్ భూపతి ఎలా తీసుకున్నాడు అంటూ మండిపడ్డారు కూడా. అయితే అమ్మడు ఏమి అంత ఈజీగా ఈ సినిమా ఒప్పుకోలేదు. మేకర్స్.. రషా కోసం కోట్లు ఖర్చుపెట్టినట్లు ఒక వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. మంగ పాత్ర కోసం రషా ఏకంగా రూ. 1 కోటి భారీ పారితోషికాన్ని అందుకున్నట్లు సమాచారం. ఒక డెబ్యూ