హైదరాబాద్ లో కాక్రోచ్ విశ్వరూపం..! సోనమ్ వాంగ్ చుక్ గర్జన
Actor ProfilePolitician

హైదరాబాద్ లో కాక్రోచ్ విశ్వరూపం..! సోనమ్ వాంగ్ చుక్ గర్జన

Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ లో కాక్రోచ్ విశ్వరూపం..! సోనమ్ వాంగ్ చుక్ గర్జన
Oneindia Telugu14 Jun 2026
హైదరాబాద్ లో కాక్రోచ్ విశ్వరూపం..! సోనమ్ వాంగ్ చుక్ గర్జన

దేశ విద్యా రంగాన్ని కుదిపేస్తున్న నీట్ (NEET-UG) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన దేశవ్యాప్త నిరసన జ్వాలలు భాగ్యనగరానికి తాకాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ బహిరంగ నిరసన ప్రదర్శన జరిగింది.విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న పాలకుల తీరుకు వ్యతిరేకంగా తరలివచ్చిన ఆందోళనకారులతో ఇందిరా పార్క్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో, గోడీ మీడియా హై హై అంటూ నినాదాలతో ధర్నా చౌక్ మార్మోగింది. ఈ మహాధర్నాకు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి హాజరై తమ మద్దతు ప్రకటించారు.లాల్ బహదూర్ శాస్త్రి నైతికత ఏది?ఈ నిరసన సభను ఉద్దేశించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడం సిగ్గుచేటన్నారు. గతంలో ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేసిన చారిత్రాత్మక ఉదాహరణను ఆయన గుర్తుచేశారు.నేటి పాలకులు కనీస నైతిక బాధ్యత లేకుండా విద్యార్థుల జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన్నంగా మారడం వల్లే పేదలు ప్రైవేట్ సంస్థల వైపు వెళ్లాల్సి వస్తోందని సభలో పాల్గొన్న పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థలో వేళ్లూనుకున్న కులతత్వానికి రోహిత్ వేముల లాంటి ఎందరో మేధావులు బలిపశువులవుతున్నారని సీజేపీప్రతినిధి విజేత దహియా మండిపడ్డారు. ఇలా చేస్తేనే కాక్రోచ్ లు బయటకు వస్తాయి చంద్రబాబు.. జాగ్రత్త..!!కలచివేసిన యదార్థ గాథలు!ఈ లీకేజీల వల్ల పేద కుటుంబాల ఆశలు ఎలా సమాధి అవుతున్నాయో వివరిస్తూ ఆకాంక్ష చతుర్వేది, ప్రదీప్ అనే విద్యార్థుల