హైదరాబాద్ మెట్రో 2
Actor ProfilePolitician

హైదరాబాద్ మెట్రో 2

Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ మెట్రో 2పై విఫలమైన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి
Zee Telugu15 Jun 2026
హైదరాబాద్ మెట్రో 2పై విఫలమైన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hyderabad Metro Dispute: 'తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిమంత్రిని ప్రశ్నించలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి. మెట్రో రెండో దశకు అనుమతి దక్కకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం. తనపై వేలాడుతున్న ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్ధతలో ఉన్నాడు. 71 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డిని బీజేపీ దేకడం లేదు. ప్రధానిని ప్రశ్నించలేకనే ప్రతిపక్షంపై నిందలు వేసే నీచ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి చేతకానితనంపై మెట్రో రెండో దశపై రేవంత్‌ రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి చేతకానితనంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు రేవంత్‌ రెడ్డి వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి' అని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్‌దే అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. కేసీఆర్ చొరవ తీసుకుని '28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన నాటి కాంగ్రెస్. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ వివరించారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్