హృదయాలను గెలిచిన జపాన్ ఫ్యాన్స్..మ్యాచ్ తర్వాత చెత్తను శుభ్రం చేసిన అభిమానులు
Actor ProfileCelebrity

హృదయాలను గెలిచిన జపాన్ ఫ్యాన్స్..మ్యాచ్ తర్వాత చెత్తను శుభ్రం చేసిన అభిమానులు

Total News1
Movie Updates0
Sources1
హృదయాలను గెలిచిన జపాన్ ఫ్యాన్స్..మ్యాచ్ తర్వాత చెత్తను శుభ్రం చేసిన అభిమానులు
Zee Telugu15 Jun 2026
హృదయాలను గెలిచిన జపాన్ ఫ్యాన్స్..మ్యాచ్ తర్వాత చెత్తను శుభ్రం చేసిన అభిమానులు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Japan Football Fans Clean Stadium: ఫీఫా ప్రపంచకప్‌ 2026లో భాగంగా జపాన్ అభిమానులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో ఆదివారం (జూన్ 14) నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జపాన్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను 2-2 పాయింట్లతో డ్రా చేసింది. అయితే ఆటతో ఫుట్‌బాల్ ఆటగాళ్లు తమ అభిమానుల హృదయాలను గెలుచుకోగా.. జపాన్ అభిమానులు కూడా తమ వంతు బాధ్యతగా ఆతిథ్య దేశం పట్ల గౌరవ సూచకంగా మ్యాచ్ తర్వాత స్టేడియంను శుభ్రం చేశారు. తమ జట్టు పాల్గొనే క్రీడా ఈవెంట్‌లలో మ్యాచ్‌ల తర్వాత తాము కూర్చున్న ప్రాంతాన్ని శుభ్రం చేయడం జపాన్ అభిమానులకు అలవాటు. ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ 2026 వారి సంస్కృతికి మరో ఉదాహరణగా నిలిచింది. ఆదివారం మ్యాచ్ తర్వాత అభిమానులు స్టేడియంను శుభ్రం చేస్తున్న వీడియోను FIFA నిర్వాహకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఎంతోమంది హృదయాలను గెలుచుకుంటోంది. జపాన్ ఫ్యాన్స్ ఎందుకు శుభ్రం చేస్తున్నారు? ఫీఫా అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన వీడియోలో.. అభిమానులు చెత్తను నీలం రంగు సంచులలో వేస్తూ స్టేడియంలో తాము కూర్చున్న ప్రాంతాన్ని శుభ్రం చేయడం కనిపిస్తుంది. అప్పుడు ఒక అభిమాని ఈ పనికి గల కారణాన్ని వెల్లడించారు. "అది మా సంస్కృతి. ఇది అన్నింటి పట్ల గౌరవం - ఆటగాళ్ల పట్ల, తోటి అభిమానుల పట్ల, స్టేడియం పట్ల గౌరవం. ఇక్కడ ఉండటం మాకు గౌరవప్రదమైన విషయం, కాబట్టి