హైకోర్టులో కొడాలి నాని క్వాష్ పిటిషన్
Actor ProfilePolitician

హైకోర్టులో కొడాలి నాని క్వాష్ పిటిషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైకోర్టులో కొడాలి నాని క్వాష్ పిటిషన్
TeluguOne5 Jul 2026
హైకోర్టులో కొడాలి నాని క్వాష్ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నవైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగుస్తోంది. . గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న ఆయన తాజాగా వార్తల్లో నిలిచారు. ఐదేళ్ల కిందటి ఒక వివాదంలో ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2021 ఫిబ్రవరి నాటి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని.. గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచార పర్వంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల కోడ్) నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించేలా ఆయన మాట్లాడారంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా.. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు, స్థానిక పోలీసులు గుడివాడ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే.. 2021లో కేసు దర్యాప్తు పూర్తయినప్పటికీ.. కొడాలి నాని అప్పట్లో మంత్రిగా ఉండటంతో ఆయనపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపడానికి ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరమైంది. ముందస్తు అనుమతి కోసం పంపిన ఆ ఫైల్, వైసీపీ హయాంలో ఎలాంటి కదలికా లేకుండా హోంశాఖలోనే పెండింగ్‌లో ఉండిపోయింది. దీంతో ఈ కేసు విచారణకు బ్రేక్ పడింది. కానీ.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పుుడు.. 2021 నాటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో కొడాలి నానిపై ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నట్లు నిర్ధారించి.. తక్షణ చర్యలకు ఆదేశించడంతో, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ మాజీ మంత్రి కొడాలి నానిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపడానికి అనుమతినిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ రావడంతో కొడాలి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు