
Maa Inti Bangaram: సమంత 'మా ఇంటి బంగారం' మూవీ రివ్యూ.. ఎక్కడో తేడా కొట్టిందే! Maa Inti Bangaram: 'ఖుషీ' సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని టాలీవుడ్‌లో సమంత నటించిన చిత్రం 'మా ఇంటి బంగారం'. 'ఓ బేబీ' వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డి, సమంత కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో పూర్తి సమీక్షలో చూద్దాం. స్వర్ణ అలియాస్ ఝాన్సీ (సమంత) ఒక అనాథ. చిన్నప్పటి నుంచి తనకు కూడా ఒక పెద్ద కుటుంబం ఉండాలని కోరుకుంటుంది. ఈ క్రమంలోనే పెద్ద కుటుంబం ఉన్న అనిరుద్ (దిగంత్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే, ఇష్టం లేని పెళ్లి కావడంతో ఆ కుటుంబం వీరిద్దరినీ దూరం పెడుతుంది.పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఆ ఇంట్లో జరిగే ఒక శుభకార్యం కోసం స్వర్ణ, ఆమె భర్త తిరిగి వస్తారు. తన మంచి మనసుతో తక్కువ సమయంలోనే ఇంట్లో వాళ్లతో కలిసిపోతుంది స్వర్ణ. కానీ, అంతలోనే ఆమె గతం ఆ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. జైల్లో ఉన్న నక్సలైట్ కరుణతో స్వర్ణకు ఉన్న వైరం కారణంగా ఆ కుటుంబానికి ముప్పు వస్తుంది. అప్పుడు తన కుటుంబం కోసం స్వర్ణ ఏం చేసింది? వాళ్లకు తన గతం చెప్పి ఎలా కాపాడుకుంది? అనేదే మిగిలిన కథ. 'మా ఇంటి బంగారం' అనేది ఒక పాత ఫార్మాట్ కమర్షియల్ కథ. సాధారణంగా స్టార్ హీరోల ఓరియెంటెడ్‌గా వచ్చే 'బాషా' తరహా ఫ్లాష్‌బ్యాక్ టెంప్లేట్‌ను, ఇక్కడ హీరోయిన్ ఓరియెంటెడ్‌గా మార్చడం కొంతవరకు కొత్తదనాన్ని ఇచ్చింది. పెద్ద ఇంటికి కోడలిగా వచ్చిన హీరోయిన్‌కు ఊహించని మాస్ గతం ఉండడం, ఆమె స్క్రీన్‌పైకి వచ్చినప్పుడల్లా ఈమె ఎవరో తెలుసా? అనే రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వడం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి భాగం మొత్తం