
సందీప్ కిషన్ ఇది వరకు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో కనిపించాడు. కానీ సోలో హీరోగా సందీప్ కిషన్ వెబ్ సిరీస్ చేసింది లేదు. అయితే ఇప్పుడు ‘సూపర్ సుబ్బు’ అంటూ సందీప్ కిషన్ ఓటీటీలోకి వచ్చాడు. ఈ సిరీస్‌ను మల్లిక్ రామ్ తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో మురళీ శర్మ, మానస చౌదరి, మిథిలా పార్కర్, గెటప్ శ్రీను వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. మరి ఈ సిరీస్ ఎలా ఉంది అన్నది ఓ సారి చూద్దాం. కథ సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు (సందీప్ కిషన్) ప్రభుత్వ ఉపాధ్యాయుడైన కుక్కుటేశ్వర్ రావు (మురళీ శర్మ) కొడుకు. కుక్కుటేశ్వర్ దృష్టిలో సుబ్బు ఓ పనికి రాని వాడు, అప్రయోజకుడు. తన రికమండేషన్‌తో పెట్టించిన టెంపరరీ జాబ్‌ని కూడా సరిగ్గా చేయడం చేతకాదు అని ఎప్పుడూ ఎగతాళి చేస్తుంటాడు. ఇక సుబ్బుకి దివ్య (మానస చౌదరి) అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు కుక్కుటేశ్వర్. టెంపరరీ ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసుకుంటే గానీ పెళ్లి జరగదు అని కుక్కుటేశ్వర్ కండీషన్ పెడతాడు. తన ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసుకునేందుకు ప్రిన్సిపాల్ మదు సూధన్ (బ్రహ్మానందం) చెప్పిన పని చేస్తానని అంటాడు సుబ్బు. ఈ క్రమంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా మాకీపూర్‌కి వెళ్లాలని కండీషన్ పెడతాడు ప్రిన్సిపాల్. చదువు సంధ్యల్లేని కుగ్రామమైన మాకీపూర్‌కు వెళ్లిన సుబ్బు ఏం చేస్తాడు? అక్కడ ఈ సెక్స్ ఎడ్యుకేషన్‌ను ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు? ప్రభుత్వం చేపట్టిన కుటుంబ నియంత్రణ ప్రోగ్రాంని ఎలా అమలు పర్చుతాడు? ఆ ఊరిలో ఉండే స్వాతి (మిథిలా పార్కర్)తో సుబ్బు ప్రయాణం ఎంత వరకు సాగుతుంది? మామూలు సుబ్బు నుంచి.. సుబ్బు సార్, సూపర్ సుబ్బు వరకు కథ ఎలా వెళ్తుంది? అన్నది తెలియాలంటే సిరీస్ అంతా చూడాల్సిందే. సెక్స్ ఎడ్యుకేషన్ అనే పాయింట్ చర్చించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు సెక్స్ ఎడ్యుకేషన్