
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Best Retirement Schemes: రిటైర్మెంట్ తర్వాత చాలామంది సురక్షితమైన క్రమబద్ధమైన ఆదాయం అందించే పెట్టుబడి మార్గాల గురించి అన్వేషిస్తుంటారు. అందులో ఫిక్స్ డిపాజిట్ తోపాటు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే ఈ మధ్యకాలంలో అనేక బ్యాంకుల్లో సీనియర్ సిటిజెన్లకు 8 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అందులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ప్రస్తుతం 8.2శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లు.. వర్సెస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఈ రెండింట్లో ఏది అత్యంత ప్రయోజనం అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వయోవృద్ధుల కోసం బ్యాంక్ ఎఫ్డీ వడ్డీరేట్లు బ్యాంకును బట్టి.. కాలపరిమితిని బట్టి మారుతుంటాయి. అయితే చిన్న ఫైనాన్స్ బ్యాంకులో సీనియర్ సిటిజన్స్ కు 8.30% వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. చాలా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సీనియర్ సిటిజనులకు 7.4.5% నుండి 8% వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఎఫ్డీల్లో అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే వాటి సౌకర్యం అని చెప్పాలి. ఇన్వెస్టర్లు తమ అవసరాలు బట్టి కొన్ని రోజుల నుండి 10 సంవత్సరాల వరకు కాలపరిమితిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. చాలా బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్ గడువుకు ముందే మూసివేసే సౌకర్యం కూడా అందిస్తుంటాయి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది భారత ప్రభుత్వం భరోసా కల్పిస్తున్న ఒక పొదుపు పథకం. ఇది ఏప్రిల్ జూన్ 2026 త్రైమాసికానికి 8.2% వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ స్కీం ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రభుత్వ హామీతో కూడిన పెట్టుబడికి బలమైన భద్రతను కల్పిస్తుంది. ఈ