సీనియర్ నేత మనీశ్ తివారీని పక్కన పెట్టిన కాంగ్రెస్
Actor ProfilePolitician

సీనియర్ నేత మనీశ్ తివారీని పక్కన పెట్టిన కాంగ్రెస్

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే
Andhra Jyothy4 Sept 2026
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అధిక ధరలకు కొన్న ముడి చమురునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ప్రాసెస్ చేసి దేశీయంగా

మెడికల్, ఇంజినీరింగ్ అడ్మిషన్లలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ
Andhra Jyothy4 Sept 2026
మెడికల్, ఇంజినీరింగ్ అడ్మిషన్లలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ

మెడికల్, ఇంజనీరింగ్ అడ్మిషన్లలో ఇకపై బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలన్న ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత్‌లో ఉన్న

సీనియర్ నేత మనీశ్ తివారీని పక్కన పెట్టిన కాంగ్రెస్
Andhra Jyothy3 Sept 2026
సీనియర్ నేత మనీశ్ తివారీని పక్కన పెట్టిన కాంగ్రెస్

వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలకు సంబంధించి సీనియర్ నేత మనీశ్ తివారీకి ఎలాంటి బాధ్యతలు దక్కకపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధం అవుతున్న పంజాబ్ కాంగ్రెస్ ఈ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కమిటీల బాధ్యతలను పలువురు నేతలకు అప్పగించింది. అయితే, సీనియర్ నేత, ఎంపీ మనీశ్ తివారీకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవడం రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. ఈ విషయంపై మనీశ్ తివారీ ఎక్స్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘అసలు నైపుణ్యాలు ఉండటమే ఒక పెద్ద తప్పు లాగా ఉంది. జనాల అభద్రతా భావాలను తొలగించే మార్గం నాకు తెలిసుంటే బాగుండేది. కాంగ్రెస్ నాకు గత 45 ఏళ్లల్లో ఎన్నో అవకాశాలు ఇచ్చింది. నేనూ నా జీవితాన్ని పార్టీకి అంకితం చేశాను. కానీ జీవితంలో ఏది రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది’ అని ఆయన ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. అయితే, మనీశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న చండీగఢ్ రాష్ట్రం పరిధిలోకి రాకపోవడంతో ఆయనకు ఎన్నికల బృందంలో చోటు దక్కలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తివారీ గతంలో లూథియానా, ఆనంద్‌పూర్ లోక్‌సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహించారు. ఇక గురువారం కాంగ్రెస్ పలు ఎన్నికల కమిటీలకు ఛైర్‌పర్సన్‌లను ప్రకటించింది. ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను కూడా నియమించింది. తివారీకి మాత్రం ఎలాంటి ఎన్నికల బాధ్యతలు దక్కలేదు. ఇక, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్‌ను కొనసాగించడంపై చరణజీత్ సింగ్ ఛన్నీ వంటి సీనియర్ నేతలు పలువురు అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈసారి ఎన్నికల ప్రచార కమిటీకి చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ నేతృత్వం వహిస్తున్నారు. ఎలక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ కోఆర్డినేషన్ కమిటీకి విజయ్ ఇందర్ సింఘ్లా నాయకత్వం వహిస్తున్నారు. విరాళాల వివాదంలో కీలక పరిణామం.. చంపత్ రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు