
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అధిక ధరలకు కొన్న ముడి చమురునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ప్రాసెస్ చేసి దేశీయంగా...
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అధిక ధరలకు కొన్న ముడి చమురునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ప్రాసెస్ చేసి దేశీయంగా విక్రయిస్తున్నాయని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అధిక ధరలకు కొన్న ముడి చమురునే ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రాసెస్ చేసి దేశీయంగా విక్రయిస్తున్నాయని అన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇటీవల ముడిచమురు ధరలు పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 30 వరకూ దాదాపు 74 వేల కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నాయని మంత్రి చెప్పారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న వైనాన్ని విలేకరులు మంత్రి హర్దీప్ సింగ్ పురీ వద్ద ప్రస్తావించారు. దేశీయంగా ధరలు ఎప్పుడు తగ్గుతాయని ప్రశ్నించారు. మరో రెండు మూడు నెలల పాటు ధరలు ఇలాగే తగ్గితే అప్పటికి ఈ ప్రశ్న సమంజసమైనది అవుతుందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్రోల్ ధరలు ఇప్పటికే 20 శాతం మేర పెరిగాయని మంత్రి చెప్పారు. భారత్ పొరుగున ఉన్న దేశాల్లో కూడా ధరలు 35 శాతం వరకూ పెరిగాయని అన్నారు. భారత్లో మాత్రం 5.58 శాతం మేరకే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని చెప్పారు.
మెడికల్, ఇంజినీరింగ్ అడ్మిషన్లలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ!
సీనియర్ నేత మనీశ్ తివారీని పక్కన పెట్టిన కాంగ్రెస్!