సాధారణ ఇటుకల ఇళ్లకు 'షీర్ వాల్' ఇళ్లకు తేడాలేంటి.. 15 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం
Actor ProfilePolitician

సాధారణ ఇటుకల ఇళ్లకు 'షీర్ వాల్' ఇళ్లకు తేడాలేంటి.. 15 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సాధారణ ఇటుకల ఇళ్లకు 'షీర్ వాల్' ఇళ్లకు తేడాలేంటి.. 15 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం
Samayam Telugu27 Jun 2026
సాధారణ ఇటుకల ఇళ్లకు 'షీర్ వాల్' ఇళ్లకు తేడాలేంటి.. 15 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం

తెలంగాణలో సొంత ఇల్లు లేని పేద ప్రజల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం సరికొత్త సాంకేతిక సొబగులను అద్దుకోనుంది. రెండో విడత ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ శైలిపై హౌసింగ్ కార్పొరేషన్ విప్లవాత్మకమైన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక క్షేత్రస్థాయి సర్వేలో అధికారులు ఒక కీలక విషయాన్ని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా దాదాపు 24 వేల మంది నిరుపేదలు పూరిళ్లు, తాత్కాలిక గుడిసెల్లోనే నివాసం ఉంటున్నట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది. ఈ నేపథ్యంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజీ లేకుండా మొదటి ప్రాధాన్యతను ఈ గుడిసెవాసులకే ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇటుక, సిమెంట్, ఐరన్, ఇసుక, నిర్మాణ కార్మికుల కూలీ ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తున్నప్పటికీ, పెరిగిన ధరల వల్ల లబ్ధిదారులు తమ సొంత డబ్బును అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పూరిళ్లలో ఉండే అత్యంత నిరుపేదలు ముందస్తుగా అంత మొత్తాన్ని భరించే పరిస్థితి ఉండదు. ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి హౌసింగ్ బోర్డు అధికారులు ' షీర్‌వాల్ టెక్నాలజీ 'ని తెరపైకి తెచ్చారు. ఈ సాంకేతికత ద్వారా లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా.. ప్రభుత్వమే నేరుగా అత్యాధునిక పద్ధతిలో ఇళ్లను నిర్మించి ఇవ్వనుంది.గత ఏడాది సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఒక స్టార్టప్ కంపెనీ 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ షీర్‌వాల్ నమూనా ఇంటిని నిర్మించి ప్రదర్శించింది. అదే విధంగా.. ఇటీవల కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో కూడా ఇదే పద్ధతిలో ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ ఇళ్ల విజయవంతమైన పనితీరును పరిశీలించిన తర్వాతే దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.అసలేంటి ఈ