
అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న సుదీర్ఘ సైనిక ఘర్షణ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయాయి. జెనీవాలో త్వరలోనే ఇరు పక్షాలు ఈ చారిత్రాత్మక ఒప్పందానికి తుది రూపం ఇవ్వనున్నాయి. అయితే, నెలల తరబడి సాగిన ఈ భీకర పోరులో ఇరాన్‌ను పూర్తిగా లొంగదీసుకోవాలని భావించిన అమెరికాకు ఆశించిన ఫలితాలు దక్కకపోవడం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై హాట్ టాపిక్‌గా మారింది.శ్వేతసౌధంలో కూర్చుని వ్యూహాలు రచించిన నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రభుత్వం కొద్ది వారాల్లోనే మోకరిల్లుతుందని భావించారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా మారాయి. పాకిస్థాన్, ఖతార్ దేశాల చురుకైన మధ్యవర్తిత్వం వల్ల ఈ ఒప్పందం కుదిరినప్పటికీ.. ఇరాన్‌ను దెబ్బతీయడంలో అమెరికా నిర్దేశించుకున్న ప్రధాన ఏడు సైనిక, రాజకీయ లక్ష్యాలు నెరవేరలేదని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అమెరికా విదేశాంగ విధానానికి గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది.అధికార మార్పిడి విఫలం.. క్రమంగా బలపడిన ఇరాన్ నేతలుయుద్ధం ప్రారంభమైన మొదటి కొన్ని రోజుల్లోనే అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు కీలక సైనిక అధికారులు మరణించారు. ఈ అగ్ర నాయకత్వం అంతమైతే ఇరాన్ పాలనా యంత్రాంగం పూర్తిగా కుప్పకూలుతుందని అమెరికా రక్షణ శాఖ అంచనా వేసింది. కానీ,ఇరాన్ తన రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ ద్వారా అతి తక్కువ కాలంలోనే నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుని పాలనను స్థిరపరిచింది. మరోవైపు దేశంలో ఇరాన్ పాలకులపై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకుని ప్రజా తిరుగుబాటు తీసుకురావాలని అమెరికా భావించింది. అయితే ఓ అమెరికా బాంబు పొరపాటున మినాబ్ నగరంలోని బాలికల పాఠశాల సమీపంలో పడి అనేకమంది విద్యార్థినులు మరణించడం ఇరాన్ జనాభాలో తీవ్ర భావోద్వేగాలను రేకెత్తించింది. అంతర్గత సమస్యలను పక్కనపెట్టి ఇరాన్ పౌరులంతా తమ దేశ సార్వభౌమత్వాన్ని