
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Cm Revanth reddy review on Heavy rains amid monsoon season: తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గా చెప్పుకునే గ్రేటర్ హైదరాబాద్ తొలకరి వర్షానికే చిగురుటాకుల వణికిపోయింది. ఈనేపథ్యంలో ఎక్కడికక్కడ రోడ్ల మీద వరద నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు చాలా అంతరాయం ఏర్పడింది. వరద నీళ్లలో కారులు, బైక్ లు కొట్టుకునిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్దిసేపు పడిన వర్షానికే నగర జీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ క్రమంలో వర్షాలపై తీసుకొవాల్సిన జాగ్రత్తలపై అన్నిశాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అంతే కాకుండా వర్షాలపై తాను ముందస్తుగాచెప్పిన ప్రణాళికల్ని అధికారులు పాటించలేదని వారిపై సీరియస్ అయ్యారు. జూన్ 1 న రివ్యూ పెట్టి వర్షాల పైన ముందస్తు సూచనలు ఇచ్చిన అధికారులు పాటించడంలో విఫలమయ్యారని అన్నారు. కనీసం జూన్ 9 న వర్షం సమయం లో అధికారులు సరిగా పని చేయలేదన్నారు. వర్షాల సమయం లో క్యూర్ ఏరియా లో మునిసిపల్ , పోలీస్, ఇతర శాఖలకు చెందిన అధికారుల మధ్య సమన్వయం లొపించిందని పేర్కొన్నారు. దీనిపైన అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. వర్షం వచ్చినప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్, బ్లాక్ స్పాట్స్, ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రాంతాల డేటా ఆధారం గా పని చేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తి స్థాయి లో సన్నద్ధం కావాలని, ఫీల్డ్ లో ఉండని అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. వర్షం