
Hyderabad Traffic Police: విద్యార్థులకు ‘వెల్కమ్ బ్యాక్ టు స్కూల్’ – విద్యానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ట్రాఫిక్ భద్రతా అవగాహన కార్యక్రమం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ గారు


Hyderabad Traffic Police: విద్యార్థులకు ‘వెల్కమ్ బ్యాక్ టు స్కూల్’ – విద్యానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ట్రాఫిక్ భద్రతా అవగాహన కార్యక్రమం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ గారు

Telangana Politics:ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2028 ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మాజీ మంత్రి

Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో వర్షాల ఉధృతి పెరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా రానున్న ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ

Nellore Crime: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు) జిల్లాలో అత్యంత కలచివేసే ఘోర విపత్తు సంభవించింది. జిల్లాలోని సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వివిధ విభాగాల మధ్య పరస్పర సమన్వయాన్ని మరింత పెంపొందించుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. Read also: Bhatti Vikramarka: సాలార్‌జంగ్ మ్యూజియం హైదరాబాద్ స్ఫూర్తికి ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి జూన్ 1న నిర్వహించిన ముందస్తు సమీక్షా సమావేశంలోనే స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ, జూన్ 9న కురిసిన వర్షాల సమయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందిందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందని, కొందరు అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే సమయంలో జీహెచ్‌ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ రోడ్లపైనే ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని కరాఖండిగా చెప్పారు. “వరదలు లేదా ట్రాఫిక్ గందరగోళం తలెత్తినప్పుడు అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. అవసరమైతే నేనే స్వయంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిస్థితులను తనిఖీ చేస్తాను” అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. దీంతో పాటు ట్రాఫిక్ నియంత్రణలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం నిర్వహించిన ఈ సమీక్ష అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. Harassment: నటిపై లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ డైరెక్టర్‌పై బంజారాహిల్స్‌లో కేసు నమోదు గమనిక: ఈ వెబ్ సైట్