
Pawan Kalyan: కాకినాడ జిల్లా, తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై వారం రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు


Pawan Kalyan: కాకినాడ జిల్లా, తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై వారం రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు

Nara Lokesh – Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంతో సాగుతున్నాయని, ఇకపై ఈ మహా సంకల్పానికి ఎక్కడా విరామం అనేదే ఉండదని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇటీవల

AP Sachivalayam: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో 2019లో చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి ఛైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత నీలాయపాలెం విజయకుమార్ ధ్వజమెత్తారు. లక్షలాది మంది ప్రతిభావంతులైన, అర్హులైన నిరుద్యోగ యువతను దగా చేసి.. కేవలం వైసీపీ సానుభూతిపరులకు, వారి అనుచరులకే ఉద్యోగాలను కట్టబెట్టారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విజయకుమార్ మాట్లాడుతూ గత నియామకాల్లోని కొన్ని కీలక ఉదాహరణలను తెరపైకి తెచ్చారు. ఏపీపీఎస్సీ (APPSC) పరీక్షల విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేసిన అనితారెడ్డి అనే అభ్యర్థికి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5 పరీక్షలో 150 మార్కులకు గాను ఏకంగా 112.5 మార్కులు ఎలా వచ్చాయని, ఆమె రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు ఎలా సాధించిందని ప్రశ్నించారు. అదేవిధంగా, ఆర్ట్స్ మరియు సైన్స్ వంటి రెండు వేర్వేరు విభాగాల్లోనూ టాపర్‌గా నిలిచిన దొడ్డ వెంకటరెడ్డి అనే అభ్యర్థికి, ఏపీపీఎస్సీ లోని ఓ అగ్ర అధికారితో ఉన్న బంధుత్వం లేదా సంబంధం ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. Read also: Chandrababu Naidu: గొలుసుకట్టు చెరువులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు గతంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా విజయకుమార్ గుర్తుచేశారు. “సచివాలయ ఉద్యోగాల్లో 90 శాతం మా కార్యకర్తలకే ఇచ్చుకున్నాం” అని విజయసాయిరెడ్డి అప్పట్లో బహిరంగంగానే ఒప్పుకున్నారని, ఆ మాటలే ఆనాటి అవినీతి నియామకాలకు సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు. అంతటి అపారదర్శక పాలన సాగించిన వైసీపీ నాయకులకు నేడు పారదర్శకత గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్న మెగా డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి