
AP Sachivalayam: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో 2019లో చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి ఛైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత నీలాయపాలెం విజయకుమార్ ధ్వజమెత్తారు. లక్షలాది మంది ప్రతిభావంతులైన, అర్హులైన నిరుద్యోగ యువతను దగా చేసి.. కేవలం వైసీపీ సానుభూతిపరులకు, వారి అనుచరులకే ఉద్యోగాలను కట్టబెట్టారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విజయకుమార్ మాట్లాడుతూ గత నియామకాల్లోని కొన్ని కీలక ఉదాహరణలను తెరపైకి తెచ్చారు. ఏపీపీఎస్సీ (APPSC) పరీక్షల విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేసిన అనితారెడ్డి అనే అభ్యర్థికి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5 పరీక్షలో 150 మార్కులకు గాను ఏకంగా 112.5 మార్కులు ఎలా వచ్చాయని, ఆమె రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు ఎలా సాధించిందని ప్రశ్నించారు. అదేవిధంగా, ఆర్ట్స్ మరియు సైన్స్ వంటి రెండు వేర్వేరు విభాగాల్లోనూ టాపర్‌గా నిలిచిన దొడ్డ వెంకటరెడ్డి అనే అభ్యర్థికి, ఏపీపీఎస్సీ లోని ఓ అగ్ర అధికారితో ఉన్న బంధుత్వం లేదా సంబంధం ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. Read also: Chandrababu Naidu: గొలుసుకట్టు చెరువులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు గతంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా విజయకుమార్ గుర్తుచేశారు. “సచివాలయ ఉద్యోగాల్లో 90 శాతం మా కార్యకర్తలకే ఇచ్చుకున్నాం” అని విజయసాయిరెడ్డి అప్పట్లో బహిరంగంగానే ఒప్పుకున్నారని, ఆ మాటలే ఆనాటి అవినీతి నియామకాలకు సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు. అంతటి అపారదర్శక పాలన సాగించిన వైసీపీ నాయకులకు నేడు పారదర్శకత గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్న మెగా డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే నిరాధారమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా బురదజల్లే రాజకీయాలు చేయడం మానుకోవాలని, వాస్తవాలను గ్రహించాలని ఈ సందర్భంగా విజయకుమార్ హితవు పలికారు.
aaranasi Movie : వైజాగ్ లో ‘వారణాసి’ షూటింగ్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Chandrababu Singapore : నేడు సింగపూర్ కు సీఎం చంద్రబాబు..పెట్టుబడులే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు
Chandrababu Naidu: గొలుసుకట్టు చెరువులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Papikondalu Boating : పాపికొండల యాత్ర నిలిపివేత
Srisailam Temple News:శ్రీశైలంలో భక్తుల భారీ విరాళం!
Prashanthi Reddy: నెల్లూరు జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదు: ప్రశాంతి రెడ్డి
RGUKT IIIT Results: ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల.. ప్రొవిజనల్ లిస్ట్‌ను ప్రకటించిన మంత్రి లోకేశ్