
అంబానీ ఇంట పెళ్లి సందడి వేడుకలో నీతా అంబానీ నుంచి కోడళ్లు వరకు అందరూ అత్యంత విలాసవంతమైన దుస్తులు, ముఖ్యంగా కళాఖండాలకు నిలువెత్తు నిదర్శనమైన డిజైనర్‌వేర్‌లలో తళుక్కుమన్నారు. అంతేగాదు కళ్లు చెదిరిపోయే ధర పలికే ఆభరణాలతో మెరిసిపోయారు. ఇప్పుడు వాటన్నింటిని తలదన్నేలా ఈ పెళ్లికూతురు దుస్తులను ధరించింది ఈ ప్రముఖ గాయని. కళాఖండమే ఆమె దుస్తులుగా మారిందా అన్నంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ వధువు దుస్తులు ఎంత ప్రత్యేకం అంటే..ప్రతిదీ ఓ కళాఖండం..ఓ అద్భుతం. బ్రిటన్ గాయని దువాలిపా నటుడు క్యాలమ్ టర్నర్‌ని జూన్ 20న సిసిలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసుకున్నారు. ఈ దంపతులు మొదట లండన్‌లో దగ్గరి బంధువుల సమక్షంలో ఒక్కటవ్వగా..ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. అక్కడ ఆమె అద్భుతమైన పెళ్లి దుస్తులతో ఫోటోలకు పోజులిచ్చారామె. ఈ దుస్తులను రూపొందించడానికి కళాకారులకు ఏకంగా నాలుగు వేల గంటలపైనే పట్టిందని గాయని దువాలిపా ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. ఆ దుస్తుల ప్రత్యేకతను వివరిస్తూ..అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకునింది. దానికి "మిస్టర్ & మిసెస్" అని క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్ చేసింది. ఆమె దుస్తుల స్పెషాల్టీ.. ఫ్రెంచ్ లేబుల్ చానెల్ రూపొందించిన ఈ పెళ్లి దుస్తులు వివరాల గురించి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇలా పేర్కొంది. ఈ హాట్ కౌచర్ దుస్తులు పారిస్‌లోని హస్తకళా కేంద్రంలో రూపుదిద్దుకున్నాయని తెలిపింది. వాటిపై ప్రత్యేకమైన డిజైన్ కోసం మైసన్స్ డి'ఆర్ట్ అటెలియర్ మాంటెక్స్, లెమరీ , లెసేజ్ వంటి ఫ్యాషన్ స్టూడియోల క్లిష్టమైన అలంకరణలు ఉన్నాయి. అందుకోసం తెల్లటి శాటిన్ వంపులను షానెల్ బ్రాండ్‌కి చెందిన మస్సారో హస్తకళల బృందం ప్రత్యేకంగా తయారు చేసింది. ఇక ఈ ఫ్రెంచ్ లేబుల్ గౌను, ముసుగుని డిజైన్ చేసిన విధానం గురించి కూడా సవివరంగా తెలిపింది. ఈ హాట్ కౌచర్ దుస్తులను అటెలియర్ మాంటెక్స్