
అంబానీ ఇంట పెళ్లి సందడి వేడుకలో నీతా అంబానీ నుంచి కోడళ్లు వరకు అందరూ అత్యంత విలాసవంతమైన దుస్తులు, ముఖ్యంగా కళాఖండాలకు నిలువెత్తు నిదర్శనమైన డిజైనర్‌వేర్‌లలో తళుక్కుమన్నారు.
Jun 21 2026 1:11 PM | Updated on Jun 21 2026 1:39 PM
అంబానీ ఇంట పెళ్లి సందడి వేడుకలో నీతా అంబానీ నుంచి కోడళ్లు వరకు అందరూ అత్యంత విలాసవంతమైన దుస్తులు, ముఖ్యంగా కళాఖండాలకు నిలువెత్తు నిదర్శనమైన డిజైనర్‌వేర్‌లలో తళుక్కుమన్నారు. అంతేగాదు కళ్లు చెదిరిపోయే ధర పలికే ఆభరణాలతో మెరిసిపోయారు. ఇప్పుడు వాటన్నింటిని తలదన్నేలా ఈ పెళ్లికూతురు దుస్తులను ధరించింది ఈ ప్రముఖ గాయని. కళాఖండమే ఆమె దుస్తులుగా మారిందా అన్నంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ వధువు దుస్తులు ఎంత ప్రత్యేకం అంటే..ప్రతిదీ ఓ కళాఖండం..ఓ అద్భుతం.
బ్రిటన్ గాయని దువాలిపా నటుడు క్యాలమ్ టర్నర్‌ని జూన్ 20న సిసిలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసుకున్నారు. ఈ దంపతులు మొదట లండన్‌లో దగ్గరి బంధువుల సమక్షంలో ఒక్కటవ్వగా..ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు.
అక్కడ ఆమె అద్భుతమైన పెళ్లి దుస్తులతో ఫోటోలకు పోజులిచ్చారామె. ఈ దుస్తులను రూపొందించడానికి కళాకారులకు ఏకంగా నాలుగు వేల గంటలపైనే పట్టిందని గాయని దువాలిపా ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. ఆ దుస్తుల ప్రత్యేకతను వివరిస్తూ..అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకునింది. దానికి "మిస్టర్ & మిసెస్" అని క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్ చేసింది.
ఆమె దుస్తుల స్పెషాల్టీ.. ఫ్రెంచ్ లేబుల్ చానెల్ రూపొందించిన ఈ పెళ్లి దుస్తులు వివరాల గురించి అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇలా పేర్కొంది. ఈ హాట్ కౌచర్ దుస్తులు పారిస్‌లోని హస్తకళా కేంద్రంలో రూపుదిద్దుకున్నాయని తెలిపింది. వాటిపై ప్రత్యేకమైన డిజైన్ కోసం మైసన్స్ డి'ఆర్ట్ అటెలియర్ మాంటెక్స్, లెమరీ , లెసేజ్ వంటి ఫ్యాషన్ స్టూడియోల క్లిష్టమైన అలంకరణలు ఉన్నాయి.
అందుకోసం తెల్లటి శాటిన్ వంపులను షానెల్ బ్రాండ్‌కి చెందిన మస్సారో హస్తకళల బృందం ప్రత్యేకంగా తయారు చేసింది. ఇక ఈ ఫ్రెంచ్ లేబుల్ గౌను, ముసుగుని డిజైన్ చేసిన విధానం గురించి కూడా సవివరంగా తెలిపింది. ఈ హాట్ కౌచర్ దుస్తులను అటెలియర్ మాంటెక్స్ ఫ్యాషన్ స్టూడియో నాలుగు లక్షల పైగా పూసలతో పూర్తిగా చేతితో ఎంబ్రాయిడరీ చేయగా, లెసాజ్ ఏకంగా 1,155 గంటల సూదితో ట్రోంప్ లొయిల్ ఆభరణాలను అమర్చింది. అంతేగాదు లెమరీ ఫ్యాషన్ స్టూడియో ఏకంగా 25 వేల ఈకలతో సులన్నితమైన అలంకరణ చేసింది.
పెళ్లి కూతురు ధరించే ముసుగు, ఆరు మీటర్లలో ట్యూట్ ముసుగు పక్షులు, పువ్వులు కవితాత్మక చిత్రాన్ని ఆవిష్కరించింది. దీన్ని పూసలు, ఈకలతో ఎండ్రాయిడరీ చేశారు. ఈ హాట్ కౌచర్ ముసుగు డిజైన్ కోసం ఏకంగా మూడుగంటలకు పైగా చేతిపని అవసరమైందట. సింపుల్‌గా చెప్పాలంటే ఈ వస్త్రధారణ ఓ కళఖండం, పైగా రాబోయే ఏళ్లలో నవ వధువులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇక నటుడు క్యాలమ్ టర్నర్ కస్టమ్ లూయిస్ విట్టన్ సూట్లో ఆకర్షణీయంగా కనిపించాడు. ఈ ఇటాలియన్ వివాహానికి జో అల్విన్, డొనాటెల్లా వెర్సాచే, గ్రేస్ గమ్మర్, ఒలివియా డీన్, మార్క్ రాన్సన్తో పాటు మరికొందరు హాజరైనట్లు సమాచారం.
(చదవండి: ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! ఆ ఐదు జపనీస్ ఫుడ్ రూల్స్..)
ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)
జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
గచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద జెంబే డ్రమ్ సర్కిల్ ఈవెంట్ (ఫొటోలు)
‘సాక్షి’ ఆధ్వర్యంలో యోగా వేడుకలు (ఫొటోలు)
వైభవంగా ఎంపీ సుప్రియా సులే కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
ఒకటి కాదు.. నాలుగు లాకప్ డెత్ కేసులు..! కూటమి వెనుకడుగుకు కారణాలు ఇవేనా?
నీ చేతకానితనం వల్లే..! అనిత పై శేఖర్ రెడ్డి సీరియస్
సూర్యవంశీ విధ్వసం.. 11బంతుల్లో హాఫ్ సెంచరీ