
ఇంటర్నెట్ డెస్క్: రాజమౌళి గొప్ప దర్శకుడు మాత్రమే కాదని.. మంచి నటుడని పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రశంసించారు. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. ఇందులో పృథ్వీరాజ్ కుంభ పాత్రలో విలన్‌గా కనిపించనున్నారు. తాజాగా ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ చిత్రం షూటింగ్, రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన (Prithviraj Sukumaran) మాటల్లోనే గతంలో మోహన్‌లాల్ దర్శకత్వంలో వచ్చిన ‘బరోజ్’ సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం నేను వారం రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగాను. ఆయన తర్వాత నన్ను డైరెక్ట్ చేసిన గొప్ప నటుడు రాజమౌళి (SS Rajamouli) అని నిస్సందేహంగా చెప్పగలను. సెట్స్‌లో ఏదైనా సీన్ వివరించేటప్పుడు ఆ పాత్రలో రాజమౌళి లీనమవుతారు. ఆసీన్‌కు కావాల్సిన ఎమోషన్స్ అన్నీ స్వయంగా తన ముఖంలో పలికిస్తారు. ఆ సన్నివేశం ఎలా చేయాలో ఆ భావోద్వేగాలు ఎలా ఉండాలో యాక్టర్స్‌కు అర్థం కావడం కోసం ఆయన పాత్రలో జీవించి చూపిస్తారు. ఒక్కోసారి రాజమౌళి చెప్పిన సన్నివేశాలు నాకు అర్థం అయ్యేవి కాదు. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా శ్రమించాను. ఆయన విజన్‌కు, నా నటనకు మధ్య సెట్స్‌లో చిన్నపాటి యుద్ధమే జరిగింది. కానీ ఆయనపై నమ్మకంతో ఆయన చెప్పిందే చేస్తాను. ఆ తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద అవుట్‌పుట్ చూసినప్పుడు ఆయన ఇంత గొప్పగా ఆలోచించి ఈ సీన్ తీశారా ఆశ్చర్యపోయేవాడిని. ఆయనతో పనిచేయడం వల్ల ఒక నటుడిగా, దర్శకుడిగా, వ్యక్తిగా నేను ఎంతో పరిణతి సాధించాను. నేను ఇప్పటి వరకూ రాజమౌళిలా కష్టపడే దర్శకుడిని చూడలేదు. ఉదయం 7 గంటలకు మొదటి షాట్ ఉంటే ఆయన 5:15 గంటలకే సెట్స్‌కు చేరుకుంటారు (Varanasi Shooting). నేను, మహేశ్, ప్రియాంక సెట్స్‌కు వచ్చేసరికి ఆయన తన అసిస్టెంట్లతో కలిసి కనీసం 12 సార్లు


