
వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project)కు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృథా కావని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన అనంతరం నిర్వాసితులు, లభ్ధిదారులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పునరావాసం కింద రైతులకు రూ.300 కోట్లు ఇస్తున్నామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు. సంకేశుల (Sankeshulu) గ్యాప్ పనులను 1998లోనే ప్రారంభించాం. గత ప్రభుత్వాలు కూడా మాలాగే చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది. మార్కాపురం జిల్లాలో పండ్ల తోటలు బాగా రావాలి. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ నేతలు దిట్ట. వైసీపీ నేతలు (YCP leaders) కళ్లు ఆర్పకుండానే అబద్ధాలు చెబుతున్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు వితండవాదం చేస్తున్నారు. వెలిగొండ పేరుతో వైసీపీ ప్రభుత్వం అనేక మోసాలు చేసింది. టన్నెల్ -2లో బోరు ఇరుక్కు పోయినా ప్రాజెక్టును ప్రారంభించేశారు. ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగం గొప్పంది. మీరు ఇచ్చిన భూముల వల్ల నాలుగైదు జిల్లాలు బాగుపడతాయి. వెలిగొండ నీళ్లు వచ్చాక చుట్టుపక్కల భూముల విలువ పెరుగుతుంది. మాది ప్రజా ప్రభుత్వం, అందరికీ లబ్ధి చేకూరుస్తాం. కరవు జిల్లా పరిస్థితులు తెలిసిన కలెక్టర్‌ను నియమించాం అని తెలిపారు
