వెబ్ సీరిస్
Actor ProfileActor

వెబ్ సీరిస్

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources2
వెబ్ సీరిస్, సినిమా ఒకదాని వెనుక ఒకటి
Chitrajyothy28 Aug 2026
వెబ్ సీరిస్, సినిమా ఒకదాని వెనుక ఒకటి

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో గ్రాండ్‌ విక్టరీ అందుకున్న ఐశ్వర్య రాజేశ్‌ తెలుగు స్ట్రయిట్‌ తెలుగు ప్రాజెక్ట్స్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ జనం ముందుకు వస్తున్నాయి. అందులో 'ఇసాక పట్నం' వెబ్ సీరిస్ కాగా, 'ఓ సుకుమారి' ఫీచర్ ఫిల్మ్! ఐశ్వర్య రాజేశ్‌ నటించిన సూపర్ హిట్‌ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' గత యేడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె నటించిన తెలుగు స్ట్రయిట్‌ మూవీ ఏదీ ఇంతవరకూ రిలీజ్ కాలేదు. అయితే గత యేడాది నవంబర్ లోనే అర్జున్ తో కలిసి ఐశ్వర్య రాజేశ్‌ నటించిన తమిళ చిత్రం ఒకటి 'మఫ్టీ పోలీస్‌'పేరుతో తెలుగులో డబ్ అయ్యింది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు మాత్రం ఐశ్వర్య రాజేశ్‌ నటించిన రెండు ప్రాజెక్ట్స్ తెలుగులో ఒక దాని వెనుక వస్తున్నాయి. సముతిరకనితో కలిసి ఐశ్వర్య రాజేశ్‌ నటించిన వెబ్ సీరిస్ 'ఇసాక పట్నం' ఈ నెల 2 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఇందులో వీరిద్దరూ తండ్రీ కూతుళ్ళుగా నటిస్తున్నారు. అయితే తండ్రి ఆధిపత్యాన్ని ఎదురించే కూతురుగా ఐశ్వర్య రాజేశ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. సునీల్‌, నరేశ్‌ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, రాజా చేంబోలు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా దీనిని నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే ఈ వెబ్ సీరిస్ ఏడు ఎపిసోడ్స్ ఉండబోతోంది. ఇదిలా ఉంటే... జూలై 17న ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్ గా నటించిన 'ఓ సుకుమారి' మూవీ రిలీజ్ కానుంది. తిరువీర్ హీరోగా నటించిన ఈ సినిమాను భరత్‌ దర్శన్ దర్శకత్వంలో మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్

తెలుగు హీరోలు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెబితే
Chitrajyothy28 Aug 2026
తెలుగు హీరోలు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెబితే

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ను ఈ నెల 2 నుంచి స్ట్రీమింగ్‌ చేయబోతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్

సేవ్ ది టైగర్స్ 3' వెబ్ సీరిస్ రివ్యూ - మల్టీవర్స్ తో మ్యారేజ్ కౌన్సెలింగ్
Telugu Times23 Aug 2026
సేవ్ ది టైగర్స్ 3' వెబ్ సీరిస్ రివ్యూ - మల్టీవర్స్ తో మ్యారేజ్ కౌన్సెలింగ్

—సూర్య ప్రకాష్ జోశ్యుల Rating : 2.75/5 అంతకు ముందు వచ్చిన సీరిస్ ని కంటిన్యూ చేస్తూ రాహుల్ (అభినవ్ గోమఠం),గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ) భార్యలతో నిరంతరం యుద్దాలు చేస్తూంటారు. కొన్ని

సేవ్ ద టైగర్స్ 3 వెబ్ సీరిస్ రివ్యూ
Chitrajyothy26 Jun 2026
సేవ్ ద టైగర్స్ 3 వెబ్ సీరిస్ రివ్యూ

మహి వి రాఘవ, ప్రదీప్‌ అద్వైతం క్రియేటర్స్ గా వ్యవహరించిన 'సేవ్ ద టైగర్స్ 3' వెబ్ సీరిస్‌ ప్రస్తుతం జియో హాట్‌ స్టార్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ కీలక పాత్రలు

గేరు మార్చి... జోరు పెంచిన నివేదా పేతురాజ్
Chitrajyothy15 Jun 2026
గేరు మార్చి... జోరు పెంచిన నివేదా పేతురాజ్

నటిగా వైవిధ్యమైన పాత్రలు చేసిన నివేదా పేతురాజ్ స్ట్రాంగ్‌ కమ్ బ్యాక్‌ ఇచ్చింది. 'సింగ్ గీతం'లో కీలక పాత్ర పోషించిన నివేదా ఇప్పుడు ఇటు చిరంజీవి, అటు వెంకటేశ్‌ సినిమాల్లోనూ నటిస్తోంది. నటి నివేదా

స్పై' దర్శకుడి కొత్త వెబ్ సీరిస్
Chitrajyothy11 Jun 2026
స్పై' దర్శకుడి కొత్త వెబ్ సీరిస్

'స్పై' మూవీ ఫేమ్‌ గ్యారీ బిహెచ్‌ రూపొందించిన వెబ్ సీరిస్‌ 'ఇసాకపట్నం'. పోర్ట్ టౌన్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సీరిస్‌లో సముతిరకని, ఐశ్వర్య రాజేశ్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. పలు తెలుగు

దూత' సెకండ్ సీజన్ షూటింగ్ షురూ
Chitrajyothy5 Jun 2026
దూత' సెకండ్ సీజన్ షూటింగ్ షురూ

అక్కినేని నాగచైతన్య సైతం నిర్మాతగా మారారు. 'దూత' వెబ్ సీరిస్‌ సీజన్‌ 2ను ఆయన శరత్‌ మరార్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సీరిస్ కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్లకు