వానల్లో వేడివేడి చాట్
Actor ProfilePolitician

వానల్లో వేడివేడి చాట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వానల్లో వేడివేడి చాట్, పానీపూరి తింటున్నారా? ఈ చేదు నిజాలు తెలిస్తే అస్సలు ముట్టుకోరు
Zee Telugu21 Jul 2026
వానల్లో వేడివేడి చాట్, పానీపూరి తింటున్నారా? ఈ చేదు నిజాలు తెలిస్తే అస్సలు ముట్టుకోరు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Expert Warns Street Food During Monsoon: వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం తీసుకునే ఆహారం పోషకాలతో పాటు అత్యంత పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. పీడియాట్రిషియన్ డాక్టర్ ఎన్. వర్షా మౌనిక రెడ్డి సూచనల ప్రకారం, స్ట్రీట్ ఫుడ్ విక్రయించే ప్రాంతాలు వైరస్‌లు, సూక్ష్మ క్రిములు వేగంగా పెరగడానికి అనువైన చోట్లు. వర్షాలు పడటం, నీరు నిల్వ ఉండటం, అపరిశుభ్ర వాతావరణం కారణంగా అక్కడ ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ ఎందుకు ప్రమాదకరం?.. వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది, ఇది బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. ఫంగస్, వైరస్‌లు కూడా ఈ సమయంలో ఎక్కువగా వస్తాయి. మురికి ప్రాంతాలు, అపరిశుభ్రమైన పారిశుద్ధ్యం, నీటి కాలుష్యం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. స్ట్రీట్ ఫుడ్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు.. వర్షాకాలంలో బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే డయేరియా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అపరిశుభ్రమైన వాతావరణం, కలుషితమైన నీటి వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడి, పేగు ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా డీహైడ్రేషన్ కూడా కలుగుతుంది. టైఫాయిడ్.. WHO ప్రకారం.. టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అపరిశుభ్రమైన గిన్నెలు, ఆహార పదార్థాల వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల జ్వరం, తల తిరగడం, నీరసం, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెపటైటిస్ ఏ.. ఇది కాలేయంపై ప్రభావం చూపే వైరల్ ఇన్ఫెక్షన్. అపరిశుభ్రమైన ఆహారం, నీటి ద్వారా ఈ