లక్ష మంది మృతి? ఎమర్జెన్సీ ప్రకటించిన దేశాధ్యక్షురాలు
Actor ProfilePolitician

లక్ష మంది మృతి? ఎమర్జెన్సీ ప్రకటించిన దేశాధ్యక్షురాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లక్ష మంది మృతి? ఎమర్జెన్సీ ప్రకటించిన దేశాధ్యక్షురాలు
Oneindia Telugu18 Jul 2026
లక్ష మంది మృతి? ఎమర్జెన్సీ ప్రకటించిన దేశాధ్యక్షురాలు

ప్రకృతి సృష్టించిన భీభత్సానికి వెనిజులా దేశం అతలాకుతలమైంది. బ్యాక్-టు-బ్యాక్ సంభవించిన భయంకరమైన భూకంపాల ధాటికి దేశవ్యాప్తంగా వందలాది భవనాలు కుప్పకూలడంతో.. ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని (State of Emergency) ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘోర విపత్తులో భారీగా ప్రాణనష్టం జరిగిందని తాత్కాలిక దేశాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అధికారికంగా ధృవీకరించారు. ప్రభుత్వ జాతీయ టెలివిజన్ ద్వారా ఆమె దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. భూకంపం కారణంగా తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారందరికీ తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు.యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదికల ప్రకారం.. రాజధాని కారకాస్‌కు పశ్చిమంగా 284 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ ఫెలిపే సమీపంలో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. ఇది జరిగిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే యుమారే పరిసర ప్రాంతంలో 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించి ఒక్కసారిగా వెనిజులాను కుదిపేసింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, కేవలం 15 కిలోమీటర్ల లోతులోనే ఈ ప్రకంపనలు కేంద్రీకృతమవడం వల్ల విపత్తు తీవ్రత మరింత పెరిగింది.Earthquakes: ఒకేసారి రెండు భారీ భూకంపాలు! అంచనా వేయలేనంత ప్రాణనష్టం?రంగంలోకి సహాయక బృందాలు.. ఉత్కంఠ రేపుతున్న పరిస్థితులుభూకంప తీవ్రత దృష్ట్యా దేశవ్యాప్తంగా సహాయక చర్యలను వెనిజులా ప్రభుత్వం పూర్తిస్థాయిలో ముమ్మరం చేసింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్స్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. లౌడ్‌స్పీకల ద్వారా స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జాతీయ టెలివిజన్ వేదికగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన డెల్సీ రోడ్రిగ్జ్.. ప్రకృతి విపత్తులో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తీవ్ర సానుభూతి తెలిపారు. అయితే ఖచ్చితమైన మృతుల సంఖ్యను వెల్లడించడానికి మరికొంత సమయం పడుతుందని ఆమె వివరించారు.