రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లు.. శ్రీధర్ బాబు ప్రకటన
Actor ProfilePolitician

రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లు.. శ్రీధర్ బాబు ప్రకటన

Total News4
Movie Updates0
Sources1
జీ7 సదస్సులో ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు
Vaartha17 Jun 2026
జీ7 సదస్సులో ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు

Donald Trump: ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ దేశాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్కింగ్ లంచ్ సమావేశంలో కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిగాయి. Read also

రేపే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
Vaartha17 Jun 2026
రేపే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

AP Inter Supplementary Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న

నటుడి కారులోకి గుర్తు తెలియని వ్యక్తి
Vaartha17 Jun 2026
నటుడి కారులోకి గుర్తు తెలియని వ్యక్తి

Arbaaz Khan:బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ కలకత్తాలో ఒక ఈవెంట్ ముగించుకొని బయటకు వస్తున్నారు. ఆ సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి హఠాత్తుగా ఆయన కారులోకి వెళ్లారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే

రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లు.. శ్రీధర్ బాబు ప్రకటన
Vaartha17 Jun 2026
రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లు.. శ్రీధర్ బాబు ప్రకటన

Arutla TPS Opening: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (TPS) బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ విద్యా విప్లవ ప్రారంభోత్సవ వేడుకలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, సీఎం రేవంత్ రెడ్డి గారి ముందుచూపును ప్రత్యేకంగా ప్రశంసించారు. Read Also : Pawan Kalyan Meets Niranjan: అభిమాని కోరిక తీర్చిన ఉపముఖ్యమంత్రి! రాష్ట్రంలోని కొత్త తరానికి సరికొత్త , అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యకు అత్యంత పెద్దపీట ఇవ్వాలని, కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను సరికొత్తగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు అని మంత్రి తెలిపారు. ఆ దిశగానే ఈ రోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ రూపంలో తొలి అడుగు పడిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా వసతుల ఆధునీకరణపై ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉందన్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన ‘యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల’ నిర్మాణం శరవేగంగా సాగుతోందని ఆయన వెల్లడించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభమైన ఈ ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను’ కూడా ఇదే స్పూర్తితో అతి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు, ప్రణాళికలను సిద్ధం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు పైసా ఖర్చు లేకుండా ‘అత్యుత్తమ విద్య, వైద్యం’ అందించాలనే బలమైన నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలన సాగిస్తున్నారని మంత్రి కొనియాడారు. ప్రభుత్వ బడులలో మౌలిక వసతులు పెంచడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే