
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana SBI land Dispute Raidurg: హైదరాబాద్ లో భూములు ప్రతిసారీ రికార్డులను సృష్టిస్తూ ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలోనే హాట్ కేకులాగా మారిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం ఒక పెద్ద వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన భూమి.. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ఒక పెద్ద వివాదానికి కారణమైంది. రాష్ట్ర ఖజానా నింపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులోని రాయదుర్గం భూములను విక్రయించాలని ప్రయత్నం చేస్తుంటే.. సరిగా 15 సంవత్సరాల క్రితం తాము కొనుగోలు భూమిని ఎలాగైనా కాపాడుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం రంగంలోకి దిగింది. రెండు బలమైన వ్యవస్థల మధ్య సాగుతున్న ఈ వివాదం ఏకంగా ఢిల్లీ వరకు చేరింది. వేల కోట్ల విలువైనటువంటి ఈ భూమిని దక్కించుకోవాలని అటు సీఎం రేవంత్ రెడ్డి సైతం నేరుగా రంగంలోకి దిగారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్లిందంటే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉన్న ప్రభుత్వ ఖాతాలను సైతం రద్దు చేయాలనే ఆలోచన వరకు వెళ్ళింది. మరోవైపు ఇందులో రాజకీయ కోణం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇందులో ప్రతిపక్షాల కుట్ర ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అసలు తెలంగాణ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మధ్య జరుగుతున్న రాయదుర్గం భూ వివాదం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎస్బీఐ మధ్య రాజుకున్న ఈ భూ వివాదం ఇప్పుడు