
Anitha vs Amaranth : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. వైసీపీ సర్కారులో మాజీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్, ప్రస్తుత హోంమంత్రి


Anitha vs Amaranth : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. వైసీపీ సర్కారులో మాజీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్, ప్రస్తుత హోంమంత్రి

kalyandurg seed distribution | కళ్యాణదుర్గం, జూన్ 15: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి రాయితీ వేరుశనగ, కంది, చిరుధాన్యాల విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని కళ్యాణదుర్గం ప్రజావేదికలో ఆయన ప్రారంభించారు. Read also: Nara Lokesh: సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. రాష్ట్ర ప్రగతి కోసం ప్రత్యేక పూజలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని కళ్యాణదుర్గం నుంచే ప్రారంభించడం సంతోషకర విషయమన్నారు. నియోజకవర్గంలో సుమారు 5 వేల మంది రైతులు విత్తనాల కోసం నమోదు చేసుకున్నారని, ప్రస్తుతం 2,200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలను సద్వినియోగం చేసుకుని రైతులు సాగు పనులను ప్రారంభించాలని సూచించారు. ఈ నెల 20న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని వెల్లడించారు. అలాగే త్వరలో ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, స్ప్రింక్లర్లు వంటి వ్యవసాయ ఉపకరణాలను రైతులకు అందజేయనున్నట్లు చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు కంది, సజ్జ, జొన్న, కొర్ర వంటి చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్‌ను వినియోగిస్తున్నామని తెలిపారు. EO Srinivasa Rao: శ్రీశైలంలో భక్తుల సౌకర్యాలపై ఈవో సమీక్ష! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Prakash Raj: రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు Chandrababu Naidu: సింగపూర్ ప్రధాని లారెన్స్