రాత్రి 12 గంటలకు పుట్టినరోజు విజయ్ తో త్రిష కేక్ కటింగ్.. ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్
Actor ProfilePolitician

రాత్రి 12 గంటలకు పుట్టినరోజు విజయ్ తో త్రిష కేక్ కటింగ్.. ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాత్రి 12 గంటలకు పుట్టినరోజు విజయ్ తో త్రిష కేక్ కటింగ్.. ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్
Zee Telugu10 Jul 2026
రాత్రి 12 గంటలకు పుట్టినరోజు విజయ్ తో త్రిష కేక్ కటింగ్.. ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Trisha Krishnan:తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విజయ్ ఈమధ్య తన 52వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే హీరోయిన్ త్రిష కృష్ణన్ నుంచి శుభాకాంక్షలు రాకపోవడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. గత కొన్నేళ్లుగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష ప్రత్యేక పోస్టులు పెడుతూ వస్తోంది. ఈసారి మాత్రం జూన్ 22న ఆమె ఎలాంటి పోస్ట్ చేయకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. కొందరు వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని కూడా ప్రచారం చేశారు. అంతేకాకుండా త్రిష విజయ్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసిందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలన్నింటికీ త్రిష ఒకే పోస్టుతో చెక్ పెట్టింది. జూన్ 23 సాయంత్రం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విజయ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో విజయ్ ఎంతో ఆనందంగా కనిపించగా, త్రిష ఆయనను చూస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. వారి ముందు పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాటు చేసిన కేకులు కూడా కనిపించాయి. ఆ ఫొటోకు త్రిష ఎంతో ప్రేమతో కూడిన సందేశాన్ని జత చేసింది. “అన్నింటినీ విలువైనవిగా మార్చే వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఆమె రాసింది. అంతేకాకుండా దానికి 0:00 అని పెట్టింది అంతే అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కటింగ్ చేసినట్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు