Advit Jewels GMP Today: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారు ఎక్కువగా ఐపీఓలపైనా ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ మంచి జోరులో ఉండటంతో ఐపీఓలు సందడి చేస్తున్నాయి. భారత ఐపీఓ మార్కెట్‌లో 2026లో అసలైన సందడి ఇప్పుడే కనిపిస్తోంది. ఒక జువెల్లరీ కంపెనీ ఐపీఓ దలాల్ స్ట్రీట్‌ను షేక్ చేసేస్తోంది. గత కొంత కాలంగా ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో సబ్‌స్క్రిప్షన్స్ నమోదు చేసింది. అదే అద్విత్ జువెల్లర్స్. ప్రస్తుతం ఇదే అత్యంత చర్చనీయాంశంగా మారింది. 3 రోజుల వ్యవధిలో ఈ ఐపీఓ ఏకంగా 212 రెట్లకుపైగా సబ్‌స్క్రైబ్ కావడం మార్కెట్ వర్గాల్నే ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NII) విభాగంలో 536 రెట్లు, క్యూఐబీలు 175 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 95 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ఈ పబ్లిక్ ఇష్యూకు ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది. ఈ ఐపీఓకు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా దాదాపు 40 శాతానికి అటుఇటుగా ఉండటం ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. అంటే దాదాపు 40 శాతం లాభంతో లిస్టవుతుందని అంచనా వేస్తున్నారు.చిన్న ఐపీఓకే ఈ రేంజ్‌లో రెస్పాన్స్ ఉంటే మరికొద్ది రోజుల్లో సబ్‌స్క్రిప్షన్‌కు రానున్న ఎన్ఎస్ఈ, రిలయన్స్ జియో, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ వంటి పెద్ద ఐపీఓలకు ఏ స్థాయిలో ఉండొచ్చన్న ప్రశ్నలు ఇన్వెస్టర్ల మదిలో మెదులుతున్నాయి. అయితే ఇంతకీ ఈ అద్విత్ జువెల్స్ సంగతేంటి.. ఇంత చిన్న ఐపీఓకు అంత భారీ రెస్పాన్స్ ఎందుకు వచ్చింది వంటి వివరాల్ని చూద్దాం.అద్విత్ జువెల్స్ కంపెనీ ఏంటి? ఇది రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన సంప్రదాయ హస్తకళా ఆభరణాల తయారీలో ప్రసిద్ధి చెందింది. రంభాజో బ్రాండ్ పేరిట ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇదే బ్రాండ్ పేరిట కుందన్, డైమండ్, పోల్కీ, స్టడెడ్ జువెల్లరీ తయారు చేస్తోంది. ఈ బ్రాండ్‌కు సుమారు శతాబ్దానికిపైగా చరిత్ర ఉండటంతో కంపెనీపై మరింత విశ్వసనీయతను పెంచింది. ఐపీఓ
Actor ProfilePolitician
రెట్లు సబ్ స్క్రిప్షన్.. 'అద్విత్ జువెల్స్' కు ఇంత క్రేజ్ ఎందుకు? జియో
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•25 Jul 2026
రెట్లు సబ్ స్క్రిప్షన్.. 'అద్విత్ జువెల్స్' కు ఇంత క్రేజ్ ఎందుకు? జియో, లకూ మ్యాజిక్ రిపీట్ అవుతుందా