సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా పరిచయమవుతున్న డెబ్యూ మూవీ ‘ఎల్లమ్మ’. ‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న వేణు యెల్దండి ఈ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. నటనకు ప్రాధాన్యమున్న ఈ పాత్రలో ఆయన కనిపిస్తే సినిమా స్థాయి మరింత పెరుగుతుందని, ఈ ఇద్దరు దిగ్గజాల కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.* బీటెక్ బాబులూ గెట్ రెడీ.. జులై 4న థియేటర్లలోకి మళ్లీ వస్తోన్న ‘రఘువరన్ బీటెక్’! వైవిధ్యమైన కథాంశంఎన్నో చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో శ్రోతలను ఊరూరూపించిన డీఎస్పీ.. ఈ సినిమా ద్వారా పూర్తి స్థాయి నటుడిగా ‘పార్శి’ అనే ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతున్నారు. నటనతో పాటు ఈ చిత్రానికి ఆయనే స్వయంగా సంగీతాన్ని సమకూర్చడం విశేషం. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. ఇది పూర్తిగా దైవిక శక్తి, స్థానిక గ్రామీణ సంప్రదాయాలు, మరియు జానపద విశ్వాసాల నేపథ్యంలో సాగుతుంది. రేణుక ఎల్లమ్మ అమ్మవారికి అంకితమైన ఒక గ్రామీణ గాయక బృందం, వారి జీవన విధానం, దైవభక్తి, వారి జీవితాల్లో ఎదురయ్యే విభిన్న సవాళ్ల చుట్టూ ఈ ఎమోషనల్ అండ్ మిస్టికల్ డ్రామా తిరుగుతుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు, వేణు యెల్దండి మార్క్ ఎమోషన్స్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుండి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది
Actor ProfileCelebrity
రాక్ స్టార్ ఎల్లమ్మ’లో వర్సటైల్ యాక్టర్.. డీఎస్పీ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•23 Jun 2026
రాక్ స్టార్ ఎల్లమ్మ’లో వర్సటైల్ యాక్టర్.. డీఎస్పీ, ప్రకాష్ రాజ్ కాంబోతో పెరిగిన అంచనాలు