సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆయన కథానాయకుడిగా పరిచయమవుతున్న డెబ్యూ మూవీ ‘ఎల్లమ్మ’. ‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న వేణు యెల్దండి ఈ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. నటనకు ప్రాధాన్యమున్న ఈ పాత్రలో ఆయన కనిపిస్తే సినిమా స్థాయి మరింత పెరుగుతుందని, ఈ ఇద్దరు దిగ్గజాల కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.* బీటెక్ బాబులూ గెట్ రెడీ.. జులై 4న థియేటర్లలోకి మళ్లీ వస్తోన్న ‘రఘువరన్ బీటెక్’! వైవిధ్యమైన కథాంశంఎన్నో చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో శ్రోతలను ఊరూరూపించిన డీఎస్పీ.. ఈ సినిమా ద్వారా పూర్తి స్థాయి నటుడిగా ‘పార్శి’ అనే ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతున్నారు. నటనతో పాటు ఈ చిత్రానికి ఆయనే స్వయంగా సంగీతాన్ని సమకూర్చడం విశేషం. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. ఇది పూర్తిగా దైవిక శక్తి, స్థానిక గ్రామీణ సంప్రదాయాలు, మరియు జానపద విశ్వాసాల నేపథ్యంలో సాగుతుంది. రేణుక ఎల్లమ్మ అమ్మవారికి అంకితమైన ఒక గ్రామీణ గాయక బృందం, వారి జీవన విధానం, దైవభక్తి, వారి జీవితాల్లో ఎదురయ్యే విభిన్న సవాళ్ల చుట్టూ ఈ ఎమోషనల్ అండ్ మిస్టికల్ డ్రామా తిరుగుతుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు, వేణు యెల్దండి మార్క్ ఎమోషన్స్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుండి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ అద్భుతంగా ఉంటూ ఒక ఆధ్యాత్మిక, మిస్టికల్ ప్రపంచాన్ని కళ్లకు కట్టాయి. ఈ భారీ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.* ఇన్‌స్టా రీల్స్ టు సిల్వర్ స్క్రీన్.. సమంత సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిన ‘జూనియర్ సూర్యకాంతం’ధర్మస్థల వివాదంలో ప్రకాష్‌రాజ్ ఇదిలా ఉండగా.. తాజాగా కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల వివాదంలో ప్రకాష్ రాజ్ పేరు రావడం పెద్ద సంచలనంగా మారింది. అక్కడ చిన్నయ్య అనే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు విషయంలో మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ కేరళ నుంచి తనకు రూ.200 కోట్లు ఇప్పించారంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందిస్తూ ఒక మీడియా సమావేశంలో పూర్తి స్పష్టతనిచ్చారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, తాను ధర్మస్థలకు ఎప్పుడూ వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. బాధితుడిగా చెప్పుకుంటున్న చిన్నయ్యకు తాను కేవలం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆశ్రయించి న్యాయం పోరాటం చేయమని మాత్రమే సలహా ఇచ్చానని, అంతకుమించి తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా వెల్లడించారు.