డెలీవర్ బాయ్‌గా ఉద్యోగానికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పకుండా బయల్దేరుతాడు వెంకీ. మొదటిసారి అబద్దం ఆడాను.. అమ్మో చాలా కష్టంగా ఉంది అని వెంకీ అనుకుంటాడు. ఉద్యోగానికి వెళ్దామని బైక్ స్టార్ట్ చేయాలని అనుకుంటాడు వెంకీ. కానీ ఎంత కిక్ కొట్టినా బైక్ మాత్రం స్టార్ట్ కాదు. దీంతో వెంకీ కంగారు పడతాడు. ఇంతలో వెంకీకి కాల్ వస్తుంది. ఇంకెంత సేపు అవుతుంది.. ఆర్డర్లు వెయిట్ చేస్తున్నాయి.. త్వరగా రా అని చెబుతాడు బాస్. దీంతో వెంకీ మరింతగా కంగారు పడతాడుడ. మరో వైపు ఇందు ఇంటికి ఓ కొరియర్ వస్తుంది. ఏం ఉందో అని చూడాలని ఇందు ప్రయత్నిస్తుంది. ఏంటి? చదివేద్దామనే అని రేఖ కౌంటర్లు వేస్తుంది. అందులో ఏం ఉంది ఇందు అని భ్రమరం అడుగుతుంది. అంత అమాయకంగా ఎలా అడుగుతున్నావ్.. ఇందుకి ఎలా తెలుస్తుంది.. చదువు రాదు కదా? అని శేషు అంటాడు. ఇందుకి చదువు వచ్చని తెలిస్తే అంతా ఎలా రియాక్ట్ అవుతారో.. చచ్చి ఊరుకుంటారేమో అని రాజు తనలో తాను అనుకుంటాడు. ఇక వచ్చిన పోస్ట్‌లో ఉన్న విషయాన్ని చూసి భూషణ్ షాక్ అవుతాడు.కంపెనీకి కొత్త సమస్య.. రా మెటీరియల్ సప్లై చేసే క్లైంట్‌కి మూడు నెలలుగా మనం పేమెంట్ చేయలేదు.. అందుకే ఇకపై సప్లై చేయడు అంట.. త్వరగా పేమెంట్ చేయమని నోటీసులు పంపాడు అని భూషణ్ చెబుతాడు. మన కంపెనీ మీద నమ్మకం పోయింది.. అందుకే ఇకపై పంపను అని అన్నాడు అంటూ రేఖ చెబుతుంది. ఎలా నమ్మకం ఉంటుంది.. అన్ని పేమెంట్స్ లేట్ చేస్తూనే వచ్చావ్ కదా అని అపర్ణ తిడుతుంది. ఎంప్లాయిస్‌కి ఇవ్వడానికే డబ్బులు లేవంటే.. వాడికి ఎలా కట్టాలని రేఖ అడుగుతుంది. మరి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి.. ఏదైనా హెల్ప్ చెయ్యి ఆంటీ అని ఇందు అడుగుతుంది.జెట్ స్పీడులో పరిగెట్టిస్తా అన్నావ్.. నిన్నటి డీల్ చేసి ఉంటే.. డబ్బులు
Actor ProfilePolitician
మరో కొత్త సమస్య.. ఆలోచనల్లో పడ్డ రాజు
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Jun 2026
మరో కొత్త సమస్య.. ఆలోచనల్లో పడ్డ రాజు, ఇందు.. అదిరే ప్లాన్ చెప్పిన సుభాష్