మద్యం మత్తులో పెళ్లికి వచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందంటే
Actor ProfilePolitician

మద్యం మత్తులో పెళ్లికి వచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందంటే

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources1
ఆపరేషన్ సిందూర్ లో అమరులైంది వీరే.. కేంద్రం అధికారిక ప్రకటన
Andhra Jyothy25 Jul 2026
ఆపరేషన్ సిందూర్ లో అమరులైంది వీరే.. కేంద్రం అధికారిక ప్రకటన

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన ఆరుగురు సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌ సమయంలో దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన

ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు.. పుణె హత్య కేసులో మరో ట్విస్ట్
Andhra Jyothy24 Jul 2026
ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు.. పుణె హత్య కేసులో మరో ట్విస్ట్

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుణె లోహగడ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ పోలీసుల విచారణలో సంచలన విషయం వెల్లడించినట్టు

భారత్ లో వాట్సాప్ ప్లస్ ప్రారంభం.. నెలకు రూ.79 చెల్లిస్తే లభించే ప్రత్యేక సదుపాయాలేంటి
Andhra Jyothy24 Jul 2026
భారత్ లో వాట్సాప్ ప్లస్ ప్రారంభం.. నెలకు రూ.79 చెల్లిస్తే లభించే ప్రత్యేక సదుపాయాలేంటి

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ సర్వీస్ యాప్ 'వాట్సాప్'. తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం మెటా సంస్థ 'వాట్సాప్ ప్లస్' పేరుతో పెయిడ్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది

ఐబీ చీఫ్ గా ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి.. కేంద్రం ఆదేశాలు
Andhra Jyothy24 Jul 2026
ఐబీ చీఫ్ గా ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి.. కేంద్రం ఆదేశాలు

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కొత్త చీఫ్‌గా మహేశ్ దీక్షిత్‌ను కేంద్రం నియమించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తాజాగా సమావేశమై.. ఆయన నియామకానికి ఆమోద ముద్ర వేసింది

మద్యం మత్తులో పెళ్లికి వచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందంటే
Andhra Jyothy24 Jul 2026
మద్యం మత్తులో పెళ్లికి వచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందంటే

వివాహ వేడుకకు తాగి వచ్చిన వరుడికి వధువు తగిన బుద్ధి చెప్పింది. అందరి ఎదుటా ధైర్యంగా నిర్ణయం తీసుకుని ప్రశంసలు అందుకుంది. ఆమె నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ సైతం అభినందించారు. వివాహ వేడుకకు తాగి వచ్చిన వరుడికి వధువు తగిన బుద్ధి చెప్పింది. అందరి ఎదుటా ధైర్యంగా నిర్ణయం తీసుకుని ప్రశంసలు అందుకుంది. ఆమె నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ సైతం అభినందించారు. రూ.5000 గౌరవ వేతనంతో ఆమెను కౌన్సెలరుగా నియమించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది (Chhattisgarh wedding). ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చాంపా జిల్లాకు చెందిన 22 ఏళ్ల ముస్కాన్ ప్రధాన్ వివాహం జూన్ 23న సంత్ రామ్ అనే యువకుడితో జరగాల్సి ఉంది. వరుడు ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే మద్యం మత్తులో ఉన్న వరుడు కారు దిగి సరిగా నిలబడలేని పరిస్థితి కనిపించింది. ఈ విషయం లోపల ఉన్న ముస్కాన్‌కు తెలిసింది. ఆమె వెంటనే బయటకు వచ్చి వరుడి చెంప ఛెళ్లుమనిపించింది. అతడితో పెళ్లి వద్దని తేల్చి చెప్పింది (Bride cancels wedding). ముస్కాన్ నిర్ణయానికి ఆమె కుటుంబ సభ్యులు కూడా మద్దతుగా నిలిచారు (Drunk groom). దీంతో ఇరు వర్గాల నడుమ కాసేపు ఘర్షణ జరిగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వరుడి తరపు వారిని వెనక్కి పంపారు. వధువు తీసుకున్న నిర్ణయాన్ని ఆ జిల్లా కలెక్టర్ జనమేజయ్ మహోబే సైతం అభినందించారు. పదో తరగతితో ఆగిపోయిన ముస్కాన్ చదువు కొనసాగేందుకు సహకరిస్తామని, కుటుంబానికి ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తామని తెలిపారు. బీఈడీ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే! హైపోథెర్మియా.. శరీర ఉష్ణోగ్రత తగ్గితే ప్రాణాపాయం!