మ్యాచ్ ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్.. మునీబా అలీని రనౌట్ చేసిన సూపర్ త్రో
Actor ProfileCelebrity

మ్యాచ్ ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్.. మునీబా అలీని రనౌట్ చేసిన సూపర్ త్రో

Total News1
Movie Updates0
Sources1
మ్యాచ్ ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్.. మునీబా అలీని రనౌట్ చేసిన సూపర్ త్రో
TV9 Telugu15 Jun 2026
మ్యాచ్ ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్.. మునీబా అలీని రనౌట్ చేసిన సూపర్ త్రో

Watch : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతమైన ఆటతీరుతో టోర్నమెంట్‌ను ప్రారంభించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల తేడాతో ఘోరంగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు 106 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో మెరవగా, బౌలింగ్‌లో దీప్తి శర్మ విశ్వరూపం చూపించింది. 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు భారత స్టార్ ఆఫ్‌స్పిన్నర్ దీప్తి శర్మ కోలుకోలేని దెబ్బ తీసింది. గత వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన దీప్తి, ఈ మ్యాచ్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించింది. తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను క్రీజులో కదలకుండా చేసింది. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఆమె కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ టీ20 బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. దీప్తి ధాటికి పాక్ జట్టు 13 ఓవర్లలోనే 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ కేవలం బౌలింగ్‌తోనే కాకుండా తన అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యంతోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ముఖ్యంగా పాక్ ఓపెనర్ మునీబా అలీ 41 పరుగులతో క్రీజులో నిలదొక్కుకుని భారత్‌కు ముప్పుగా మారుతున్న సమయంలో దీప్తి శర్మ ఒక అద్భుతమైన రనౌట్ చేసింది. క్రీజు వెలుపల ఉన్న మునీబా అలీని గమనించిన దీప్తి, చిరుతపులిలా కదిలి బంతిని అందుకుని వికెట్లకు నేరుగా కొట్టింది. ఈ బుల్లెట్ లాంటి త్రోకు మునీబా అలీ రనౌట్ కాక తప్పలేదు. ఈ ఒక్క రనౌట్‌తో పాకిస్తాన్ గెలుపు ఆశలు పూర్తిగా సమాధి అయ్యాయి. ICC Women's #T20WorldCup