మీ భూమిలో లంకెబిందెలు
Actor ProfileCelebrity

మీ భూమిలో లంకెబిందెలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మీ భూమిలో లంకెబిందెలు, వజ్రాలు దొరికితే ఏం చేయాలి? మీకు సొంతం కావాలంటే చట్టం ఏం చెబుతుంది
Zee Telugu24 Jun 2026
మీ భూమిలో లంకెబిందెలు, వజ్రాలు దొరికితే ఏం చేయాలి? మీకు సొంతం కావాలంటే చట్టం ఏం చెబుతుంది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Hidden Treasure Laws In India: మన సొంత భూమి లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తిపై మనకు సర్వహక్కులూ ఉంటాయని భావించడం సహజం. కానీ, భారతీయ చట్టాల ప్రకారం భూమి ఉపరితలంపై ఉండే హక్కులకు, భూగర్భంలో లభించే వనరులపై ఉండే హక్కులకు చాలా తేడా ఉంది. రజనీకాంత్ 'నరసింహ' సినిమాలో చూపించినట్లుగా సొంత భూమిలో ఖనిజాలు దొరకగానే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావడం నిజ జీవితంలో సాధ్యం కాదు. మీ భూమిలో లంకెబిందెలు, వజ్రాలు లేదా ఖనిజాలు లభిస్తే చట్టం ఏం చెబుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. భూమిలో ఖనిజాలుంటే హక్కు ఎవరిది? మీ భూమి అడుగున బొగ్గు, ముడి ఇనుము, పెట్రోలియం, బంగారం లేదా వజ్రాలు వంటి ఏ రకమైన సహజ ఖనిజ సంపద బయటపడినా.. దానిపై మీకు ఎలాంటి హక్కు ఉండదు. చట్టం ఏం చెబుతోంది? 'మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం, 1957' ప్రకారం భూగర్భంలో ఉండే అన్ని రకాల ఖనిజాలపై పూర్తి నియంత్రణ, హక్కులు కేవలం ప్రభుత్వం (రాష్ట్ర లేదా కేంద్ర) పరిధిలోనే ఉంటాయి. 2024 జులై నాటి చారిత్రాత్మక 'మినరల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ' కేసుతో పాటు 2025లో కూడా సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై స్పష్టతనిచ్చింది. భూమి మీదే అయినప్పటికీ, ప్రభుత్వ అనుమతి (లీజు) లేకుండా, రాయల్టీ చెల్లించకుండా అందులో మైనింగ్ చేసే హక్కు ఎవరికీ లేదు. లంకెబిందెలు లేదా నిధులు దొరికితే? పాతకాలం నాటి బంగారు నాణాలు, వెండి ఆభరణాలు