బాలీవుడ్ నటి దిశ పటానీ ముంబైలోని తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చారు. ఖార్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఈ ఫ్లాట్‌కు నెలకు రూ. 2.85 లక్షల చొప్పున అద్దె లభించనుంది. రెండేళ్ల కాలానికి కుదిరిన ఈ ఒప్పందం ద్వారా ఆమెకు సుమారు రూ. 71 లక్షల మేర ఆదాయం సమకూరనుందని ప్రాపర్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.రుస్తుంజీ పారామౌంట్ ప్రాజెక్టులో ఉన్న ఈ ఫ్లాట్ విస్తీర్ణం 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉంటుంది. జూన్ 1న ఈ లీజు ఒప్పందం రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. మూడు నెలల అద్దెకు సమానమైన రూ. 8.55 లక్షలను దిశ సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం, ఏడాది పూర్తయిన తర్వాత అద్దెపై 5 శాతం పెంపు ఉంటుంది.ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్లకు భారీ డిమాండ్ ఉండటంతో, పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ ఆస్తులను అద్దెకు ఇచ్చి అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తాజాగా దిశ పటానీ సైతం అదే బాటలో పయనించారు
Actor ProfileActor
ముంబై ఫ్లాట్
Total News1
Movie Updates0
Sources1
AP7AM•16 Jun 2026
ముంబై ఫ్లాట్ పై దిశ పటానీకి నెలకు రూ. 2.85 లక్షల అద్దె