బాలీవుడ్ నటి దిశ పటానీ ముంబైలోని తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చారు. ఖార్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఈ ఫ్లాట్‌కు నెలకు రూ. 2.85 లక్షల చొప్పున అద్దె లభించనుంది. రెండేళ్ల కాలానికి కుదిరిన ఈ ఒప్పందం ద్వారా ఆమెకు సుమారు రూ.
71 లక్షల మేర ఆదాయం సమకూరనుందని ప్రాపర్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.రుస్తుంజీ పారామౌంట్ ప్రాజెక్టులో ఉన్న ఈ ఫ్లాట్ విస్తీర్ణం 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉంటుంది. జూన్ 1న ఈ లీజు ఒప్పందం రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది.
మూడు నెలల అద్దెకు సమానమైన రూ. 8.55 లక్షలను దిశ సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం, ఏడాది పూర్తయిన తర్వాత అద్దెపై 5 శాతం పెంపు ఉంటుంది.ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్లకు భారీ డిమాండ్ ఉండటంతో, పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ ఆస్తులను అద్దెకు ఇచ్చి అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
తాజాగా దిశ పటానీ సైతం అదే బాటలో పయనించారు
.