మీ కామెంట్లు
Actor ProfilePolitician

మీ కామెంట్లు

Total News1
Movie Updates0
Sources1
మీ కామెంట్లు, వీడియోలు చాలా బాధిస్తున్నాయి.. తుని మిస్సింగ్ బాలిక జ్ఞానేశ్వరి తల్లి ఆవేదన
Zee Telugu15 Jun 2026
మీ కామెంట్లు, వీడియోలు చాలా బాధిస్తున్నాయి.. తుని మిస్సింగ్ బాలిక జ్ఞానేశ్వరి తల్లి ఆవేదన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tuni missing girl Gnaneswari mother emotional over false alleagtions: ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ జిల్లా తుని ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. స్థానికంగా సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికి లభ్యం కాలేదు. స్థానిక పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి అణువణువు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో చిన్నారి జాహ్నవీ మిస్సింగ్ వెనుకాల ఇటీవల సోషల్ మీడియాలో చాలా మంది దారుణంగా ఫెక్ ప్రచారాలు చేస్తున్నారు. కొంత మంది జాహ్నవీ తల్లిదండ్రులపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. జాహ్నవీ తల్లి కూతుర్ని ఎవరికైన అమ్మేసి ఉంటుందని కొంతమంది, తండ్రి తన కూతుర్ని ఏమైన చేసి ఉండొచ్చని కూడా కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు కూడా పలు మార్లు జాహ్నవీ తండ్రిని విచారించారు. మరికొంత మంది ఏదైన క్రూర జంతువులు తినేసి ఉండొచ్చని కూడా ప్రచారం చేస్తున్నారు.ఇక అమావాస్య కూడా రావడంతో బాలికను బలివ్వడానికి తల్లిదండ్రులు ఎవరికైన విక్రయించి ఉంటారని కూడా ప్రచారం చేశారు. దీనిపై నెట్టింట చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా.. ఈ ఘటనపై జాహ్నవీ తల్లి చాలా ఎమోషనల్ అయ్యింది. ఒక వీడియో పెట్టి మరీ సోషల్ మీడియాలో ఫెక్ ప్రచారం చేయోద్దని కోరింది. వారం రోజుల నుంచి తాము ఏంతింటున్నాం.. ఎలా బతుకున్నామో తమకే తెలుసన్నారు. ఒకవైపు తన కన్న కూతురు కన్పించడంలేదనే బాధ ఒకవైపు, మరోవైపు కొంత మంది సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్, ఫెక్ ప్రచారం చేస్తు వీడియోలు, పోస్ట్ లు చేస్తున్నారని ఇది మరింత ఆవేదన