
వెనిజులాలో గత మే నెలలో గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్న ఒక భారతీయ నావికుడి (సీఫేరర్) 33 ఏళ్ల రాకేష్ చౌహాన్ అనుమానాస్పద మరణంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ అమెరికా దేశం నుండి స్వదేశానికి తీసుకువచ్చిన రాకేష్ చౌహాన్ కుటుంబ సభ్యులు అతని మృతదేహంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులతో సహా పలు అంతర్గత అవయవాలు మాయమయ్యాయని ఆరోపించారు. కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు భారతదేశంల నిర్వహించిన పునర్-పోస్ట్‌మార్టం (Re-autopsy) నివేదికలో వెల్లడైన విషయాలు అత్యంత దిగ్భ్రాంతికరంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాకేష్ మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని 'ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా' (FSUI) డిమాండ్ చేసింది. ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, వెనిజులా అధికారులు ఎలాంటి పోస్ట్‌మార్టం నివేదిక లేదా వివరాలు ఇవ్వకుండానే రాకేష్ చౌహాన్ భౌతికకాయాన్ని ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఉన్న అతని స్వగ్రామానికి పంపించారని FSUI పేర్కొంది. FSUI పోస్ట్ ప్రకారం మృతదేహంలో ఒక్క అవయవం కూడా లేదు. మెదడు, గుండె, రెండు ఊపిరితిత్తులు, కాలేయం (లివర్), మూత్రపిండాలు (కిడ్నీలు), ప్లీహం (స్లీన్), క్లోమం (పాంక్రియాస్), ప్యాంక్రియాస్, కడుపు, ప్రేగులు... ఇలా అన్నీ మాయమయ్యాయి. అలాగే థైరాయిడ్, హయాడ్ ఎముక, లారింక్స్, శ్వాసనాళం కూడా లేవు. మృతదేహంపై గతంలోనే భారీగా కుట్లు వేసి ఉన్నాయి. మెడ నుండి ప్యూబిక్ సింఫిసిస్ వరకు 22 కుట్లు, ఒక చెవి నుండి మరో చెవి వరకు 21 కుట్లు ఉన్నాయి. మరణానికి ముందు జరిగిన గాయాల గుర్తులేవీ లేవు. మృతదేహాన్ని దాదాపు నెల రోజుల పాటు డీప్ ఫ్రీజర్‌లో ఉంచారు. శరీరంలో ఎలాంటి అవయవాలు లేకపోవడం వల్ల మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేక పోయారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. సముద్రయాన కార్మికులు బలిపశువులుగా మారుతున్నారు. వెనిజులా అధికారుల నుండి పూర్తి విచారణ, జవాబుదారీతనం, వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం