టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరీర్ పరంగా అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఆయన నుంచి సినిమా వస్తోందంటే చాలు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయడంతో పాటు కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు సైతం బలంగా నమ్ముతుంటాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా ఆయన తెరకెక్కించిన 'మన శంకర వరప్రసాద్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 400 కోట్ల వసూళ్లను సాధించి, ఇండస్ట్రీ హిట్ జాబితాలో చేరింది. ఈ ఘన విజయంతో లభించిన భారీ ఉత్సాహంతో, అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీగా ఒక ఊహించని మల్టీస్టారర్ ప్రాజెక్టును ప్రకటించి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచారు. విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో సరికొత్త చర్చ మొదలైంది.* కదిలించిన అభిమాని కోరిక... హనుమకొండకు వచ్చి గుండెలకు హత్తుకున్న పవన్ కళ్యాణ్ఈ విలక్షణ కాంబినేషన్ వెనుక ఆసక్తికరమైన సెంటిమెంట్లు దాగున్నాయి. అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'పటాస్' వంటి బ్లాక్‌బస్టర్ అందించిన నటుడు కళ్యాణ్ రామ్ కాగా.. మరోవైపు 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి చిత్రాలతో అనిల్‌కు మోస్ట్ లక్కీ హీరోగా మారారు వెంకటేష్. ఇలా అనిల్‌కి అత్యంత ఆప్తులైన ఈ ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు, ప్రీ ప్రొడక్షన్ పనులు ముగియగా, అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర బృందం సమాయత్తమవుతోంది.* అనిల్ రావిపూడి సంక్రాంతి స్కెచ్.. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు అదిరిపోయే టైటిల్! తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్న కథనాల ప్రకారం.. ఈ చిత్రంలో వెంకటేశ్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ బావ-బామ్మర్దుల పాత్రల్లో సందడి చేయనున్నారట
Actor ProfileActor
బావ బామ్మర్దులుగా వెంకీ
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•17 Jun 2026
బావ బామ్మర్దులుగా వెంకీ, కళ్యాణ్ రామ్... అనిల్ రావిపూడి సంక్రాంతి సరుకు’ అదుర్స్ అంతే