టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరీర్ పరంగా అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఆయన నుంచి సినిమా వస్తోందంటే చాలు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయడంతో పాటు కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు సైతం బలంగా నమ్ముతుంటాయి.
అందుకు తగ్గట్టుగానే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా ఆయన తెరకెక్కించిన 'మన శంకర వరప్రసాద్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 400 కోట్ల వసూళ్లను సాధించి, ఇండస్ట్రీ హిట్ జాబితాలో చేరింది. ఈ ఘన విజయంతో లభించిన భారీ ఉత్సాహంతో, అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీగా ఒక ఊహించని మల్టీస్టారర్ ప్రాజెక్టును ప్రకటించి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచారు.
విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్లో సరికొత్త చర్చ మొదలైంది.* కదిలించిన అభిమాని కోరిక... హనుమకొండకు వచ్చి గుండెలకు హత్తుకున్న పవన్ కళ్యాణ్ఈ విలక్షణ కాంబినేషన్ వెనుక ఆసక్తికరమైన సెంటిమెంట్లు దాగున్నాయి.
అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'పటాస్' వంటి బ్లాక్‌బస్టర్ అందించిన నటుడు కళ్యాణ్ రామ్ కాగా.. మరోవైపు 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి చిత్రాలతో అనిల్‌కు మోస్ట్ లక్కీ హీరోగా మారారు వెంకటేష్. ఇలా అనిల్‌కి అత్యంత ఆప్తులైన ఈ ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు, ప్రీ ప్రొడక్షన్ పనులు ముగియగా, అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర బృందం సమాయత్తమవుతోంది.* అనిల్ రావిపూడి సంక్రాంతి స్కెచ్.. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు అదిరిపోయే టైటిల్!
తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్న కథనాల ప్రకారం.. ఈ చిత్రంలో వెంకటేశ్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ బావ-బామ్మర్దుల పాత్రల్లో సందడి చేయనున్నారట
. నిరంతరం ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ, ఇద్దరి మధ్య సాగే వినోదాత్మకమైన సీన్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. వెంకటేశ్ మార్క్ ఫ్యామిలీ కామెడీ టైమింగ్‌కు, కళ్యాణ్ రామ్ ఎనర్జిటిక్ యాక్టింగ్ తోడైతే థియేటర్లలో ప్రేక్షకులకు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ లభించడం ఖాయం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లుగా కీర్తి సురేష్, కృతి శెట్టి నటిస్తున్నట్లు సమాచారం. యువ సంచలనం జి. వి. ప్రకాష్ కుమార్ సంగీత బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ భారీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సాధారణంగానే అనిల్ రావిపూడి సినిమాల్లో వినోదానికి, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త ప్రాజెక్టును కూడా పూర్తి స్థాయి హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయట. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టును 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. పండుగ సీజన్‌ను టార్గెట్ చేసుకుని వస్తున్న ఈ చిత్రానికి ఇండస్ట్రీలో ఒక వైవిధ్యమైన టైటిల్ వినబడుతోంది. అనిల్ మార్క్ కామెడీకి, పండుగ వాతావరణానికి సరిగ్గా సరిపోయేలా ఈ సినిమాకు ‘ సంక్రాంతి సరుకు ’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ క్రేజీ అప్డేట్తో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి. మరి ఈ మల్టీస్టారర్‌తో అనిల్ రావిపూడి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.