
చాలా రోజులుగా వార్తల్లో ఉన్న బాలకృష్ణ, కొరటాల శివ చిత్రం ఎట్టకేలకు ప్రారంభం అయింది. చాలా రోజులుగా వార్తల్లో ఉన్న బాలకృష్ణ (Nandamuri BalaKrishna), కొరటాల శివ (Koratala Siva) చిత్రం ఎట్టకేలకు ప్రారంభం అయింది. గురువారం ఉదయం అమరావతిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం షూటింగ్ అట్టహాసంగా మొదలు పెట్టారు. #NBK112గా రూపొందుతున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి సుమారు రూ.200 కోట్ల పెట్టుబడితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందు ప్రకటించినట్లుగానే ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హజరై ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టారు.. ఈ కార్యక్రమానికి ఇంకా మంత్రి కందుల దుర్గేశ్, సురేశ్ బాబు, బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, దర్శకుడు గోపీచంద్ మలినేని వంటి వారు హజరయ్యారు. ఈ ఆగష్టు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి 2027 వేసవికి ప్రేక్షకుల ఎదుటకు తీసుకు రానున్నారు





