
Telugu Times•15 Jun 2026
బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ బడిలో బ్రేక్‌ఫాస్ట్ (Breakfast) కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు. ఉపాధ్యాయులు (Teachers), సిబ్బంది, అక్కడి విద్యార్థుల (Students)కు అల్పాహారం వడ్డించారు. ఈ పథకంతో రాష్ట్రంలో 1.44 లక్షల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు పాఠశాల ప్రారంభమైన తొలిరోజే పాఠశాలల్లో పుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది