బీజేపీ తొత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం
Actor ProfilePolitician

బీజేపీ తొత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం

Total News3
Movie Updates0
Sources1
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు.. జూన్ 23 నుంచి సంప్రదింపులు
Andhra Jyothy16 Jun 2026
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు.. జూన్ 23 నుంచి సంప్రదింపులు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను రాజకీయాలకు అతీతంగా గుర్తిస్తామని అందుకోసం ఏర్పాటైన కమిటీ స్పష్టం చేసింది. జూన్ 23వ తేదీ నుంచి ఉద్యమకారుల గుర్తింపుపై దశలవారీ సంప్రదింపులు

జులై మూడో వారంలో తల్లికి వందనం
Andhra Jyothy16 Jun 2026
జులై మూడో వారంలో తల్లికి వందనం

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని త్వరగా అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్

బీజేపీ తొత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం
Andhra Jyothy16 Jun 2026
బీజేపీ తొత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం

సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్‌పై బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సంగారెడ్డి, జూన్16: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. అలాంటి దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) బీజేపీకి తొత్తుగా మారిందని ఆరోపించారు. 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని.. కానీ ప్రస్తుతం వారికి ఓట్లు పడవనుకుంటే వాటిని తొలగిస్తుందన్నారు. మతతత్వ పార్టీలకు ప్రయోజనం చేకూరేలా ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ నిర్వహించే కుట్ర జరుగుతుందని విమర్శించారు. మంగళవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్‌పై బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ పేరుతో 92 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారని వివరించారు. ఈ ఎస్ఐఆర్‌ ప్రక్రియలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితోపాటు తన ఓటు గల్లంతు అయినా ఆశ్చర్య పోనక్కర్లేదని మహేశ్ కుమార్ గౌడ్ వ్యంగ్యంగా అన్నారు. తమ ఓట్లు క్షేమంగా ఉండాలంటే బీఎల్‌ఏ కీలకంగా పని చేయాల్సి ఉందని చెప్పారు. రాజకీయాల్లో తనకు దామోదర రాజనర్సింహ ఓనమాలు నేర్పించారని గుర్తు చేసుకున్నారు. ఈ దేశంలో అతికొద్దిమంది నిజాయితీపరుల్లో మీనాక్షి నటరాజన్ ఒకరని పేర్కొన్నారు. ఆ కారణంతోనే ఆమె రాజ్యసభ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారని తెలిపారు. బీజేపీ వాళ్లకి కనికరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతరం అధికారంలో ఉండి చక్రవర్తుల్లా ఉండాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మీ కంటే పెద్ద చక్రవర్తులే నేలమట్టం అయ్యారు.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఎంత..? అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం అనుకుంటే.. వారు మూర్ఖులే