బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ.. ఒకే ఏడాది రూ. 300 కోట్ల క్లబ్ లో తండ్రీకొడుకులు
Actor ProfileActor

బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ.. ఒకే ఏడాది రూ. 300 కోట్ల క్లబ్ లో తండ్రీకొడుకులు

Total News1
Movie Updates0
Sources1
బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ.. ఒకే ఏడాది రూ. 300 కోట్ల క్లబ్ లో తండ్రీకొడుకులు
Samayam Telugu16 Jun 2026
బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ.. ఒకే ఏడాది రూ. 300 కోట్ల క్లబ్ లో తండ్రీకొడుకులు

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు క్రియేట్ అవుతూ ఉంటాయి. మరెన్నో రికార్డులు కాలగర్భంలో కలిసిపోతుంటాయి. కానీ టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ సృష్టించిన ఈ సరికొత్త రికార్డు మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎప్పటికీ నిలిచిపోయే ఒక అరుదైన మైలురాయిగా చెప్పొచ్చు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో తండ్రి, కొడుకు ఇద్దరూ విడివిడిగా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటడం అనేది ఇప్పటివరకు ఏ స్టార్ ఫ్యామిలీకి సాధ్యం కాలేదు. ఆ అసాధ్యమైన ఘనతను మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సుసాధ్యం చేసి చూపించారు. ఈ గ్లోబల్ రికార్డ్‌తో మెగా అభిమానులు కాలర్ ఎగరేస్తూ సామాజిక మాధ్యమాల్లో పండగ చేసుకుంటున్నారు.గత కొంతకాలంగా సరైన కమర్షియల్ సక్సెస్ లేక ట్రేడ్ వర్గాలు డీలా పడిపోయిన తరుణంలో.. బాక్సాఫీస్‌కు తనదైన శైలిలో మాస్ ఊపు తెచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రంతో ఆయన థియేటర్లలో విజువల్ ఫీస్ట్ అందించారు. చిరు వింటేజ్ మాస్ లుక్, నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్లోబల్ గ్రాస్ వసూళ్లను సాధించి, మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఇండస్ట్రీకి మరోసారి ఘనంగా చాటిచెప్పింది.* రూ.400 కోట్ల క్లబ్‌కి అడుగు దూరంలో ‘పెద్ది’.. పద్దుల చిట్టా బయటపెట్టిన నిర్మాత ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ ఒకవైపు తండ్రి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తే.. మరోవైపు కొడుకు రామ్ చరణ్ అంతకుమించిన వేగంతో సరికొత్త రికార్డులను వేటాడుతున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఇన్‌స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 393 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. కేవలం పది రోజుల్లోనే చరణ్ సినిమా