
సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల ధ్యాసంతా పిల్లల మీదే ఉంటుంది. కాబట్టి ఒకరినొకరు పట్టించుకోకపోవడం సహజం. అయితే పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇద్దరూ తమ అనుబంధాన్ని మరింత దృఢం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం రండి.. ఇద్దరు ఉన్నప్పుడు ఉండే బాధ్యతల కంటే ముగ్గురైనప్పుడు అదనంగా మరికొన్ని కొత్త బాధ్యతలు వచ్చిపడతాయి. వీటిని ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. ఈ క్రమంలో ఇంటి పనుల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం లేదంటే ఒకరు ఇంటి పనులు చేసుకుంటుంటే.. మరొకరు పాపాయిని ఎత్తుకోవడం, ఆడించడం.. వంటివి చేయాలి. అయితే ఈ సమయంలో ఓపిక కోల్పోయి భాగస్వామిపై చిరాకు పడడం, వారిని ఏదో ఒక మాట అనడం.. వంటివి చేయకూడదు. ఇలా ఇద్దరూ పనులు పంచుకుంటూ.. సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితే అటు పనులూ పూర్తవుతాయి.. ఇటు ఇద్దరి మధ్య బంధమూ పటిష్టమవుతుంది. అలాగే పాపాయికి ఏ లోటూ లేకుండా కూడా జాగ్రత్తపడచ్చు. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే.. ఇద్దరూ కలిసి ప్రేమగా మాట్లాడుకోవడం కూడా ముఖ్యమే. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. ఎందుకంటే.. పాపాయి ఆలనాపాలనా చూసుకోవడానికే సమయం సరిపోతుంది. అలాగని భార్యాభర్తలు ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకోవడం కూడా సరికాదు. కాబట్టి పాపాయి అవసరాలు తీరిన తర్వాత, తను పడుకున్నప్పుడో, ఆడుకుంటున్నప్పుడో.. ఇద్దరూ కలిసి కాసేపు ప్రేమగా మాట్లాడుకోవడం, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకోవడం.. అలా కాసేపు బయట గడపడం.. వంటివి చేస్తే ఇద్దరి మధ్య ప్రేమ, అర్థం చేసుకునే తత్వం మరింతగా పెరుగుతాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లోనే పాపాయితో సరదాగా గడుపుతూ కూడా భార్యాభర్తలు వారి బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. దంపతులిద్దరూ ఒకరికి ఇష్టమైన వంటకాలు మరొకరు తయారుచేసి సర్‌ప్రైజ్ చేయడం, నచ్చిన సినిమాలు చూడడం, కాసేపు పాటలు వినడం.. వంటివి చేయాలి. దీంతో ఇద్దరి మధ్య