
పొరుగు రాష్ట్రమైన కేరళలో మళ్లీ 'నిఫా' వైరస్ కేసులు వెలుగుచూడటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ నుంచి తమిళనాడులోకి వైరస్ వ్యాపించకుండా విజయ్ సర్కార్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్


పొరుగు రాష్ట్రమైన కేరళలో మళ్లీ 'నిఫా' వైరస్ కేసులు వెలుగుచూడటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ నుంచి తమిళనాడులోకి వైరస్ వ్యాపించకుండా విజయ్ సర్కార్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్న ప్రభుత్వానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే విధంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, జూన్ 15: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్న ప్రభుత్వానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు(సోమవారం) ఉదయం రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్, పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే విధంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. వారంలో 6 రోజులు మంచి బ్రేక్ ఫాస్ట్ పాలు, రాగి జావాను అందిస్తున్నామని.. దాదాపు రూ.800 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ స్కూల్లో చదివితేనే ప్రభుత్వ పథకాలు అందుతాయనే రోజులు రానున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు కావాలి కానీ ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూల్ వద్దు అనే భావన ఉందన్నారు. దాన్ని తొలగించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రూ.800 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు.. ఇంటర్‌లో 950 మార్కులు సాధించిన విద్యార్థి కరెంట్ షాక్‌తో మృతి