ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం
Actor ProfilePolitician

ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం
Vaartha19 Jun 2026
ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం

Alternative crops : భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, కోట్ల మంది ప్రజల జీవనాధారానికి వ్యవసాయ రంగమే వెన్నెముక అన డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, దేశీయ వ్యవసాయం ఇప్ప టికీ ప్రధానంగా రుతుపవనాల జూదంగానే సాగుతోంది. దేశం మొత్తం మీద ఏడాది పొడవునా కురిసే వార్షిక వర్షపాతంలో సింహ భాగం, అనగా దాదాపు 75 శాతం వర్షపాతం జూన్ నుండి సెప్టెంబర్ వరకు విస్తరించే నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. అందువల్లనే, భారతీయ రైతాంగానికి అత్యంత కీలకమైన ఖరీఫ్ (వర్షాకాలం) పంటల విజయా పజయాలు పూర్తిగా ఈ వర్షాల పంపిణీపైనే ఆధారపడి ఉంటాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు, భూతాపం (గ్లోబల్ వార్మింగ్)ప్రభావాలు, పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ‘ఏలి నినో వంటి తీవ్ర సముద్ర వాతావరణ పరిస్థితులు రుతుపవనాల గమనాన్ని తీవ్రంగా గందరగోళానికి గురిచేస్తున్నాయి. దీనిఫలితంగా ఒకే ఏడాది లో కొన్ని ప్రాంతాల్లో మేఘమథనంతో కూడిన అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో చుక్క నీరు లేని అనావృష్టి ఏర్పడి వర్షపాత పంపిణీలో తీవ్రమైన ప్రాంతీయ అసమతుల్యత చోటు చేసుకుంటోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో కాలం చెల్లిన సంప్రదాయ సాగువిధానాలను పక్కనబెట్టి, మారు తున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపి కలోనూ, సాగు నిర్వహణలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురావలసిన చారిత్రక అవసరం నేడు రైతాంగంపై ఉంది. శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తే, ఎల్నినో అనేది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడాన్ని సూచించే ఒక సంక్లిష్ట వాతావరణ ప్రక్రియ. Read Also : AP Tobacco farmers: కిలో పొగాకు రూ.200కు తగ్గకూడదు పసిఫిక్ సము ద్రంలో పెరిగే ఈ ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల వాతావరణ పీడన వ్యవస్థల్లో మార్పులు వచ్చి, భారతదేశానికి వర్షాలను మోసుకొచ్చే రుతుపవన గాలులు బలహీనపడతాయి. భారత వాతావరణ శాఖ గత వందేళ్ల చారిత్రక గణాంకాలను పరిశీ లిస్తే