ప్రజలు రూ.50
Actor ProfilePolitician

ప్రజలు రూ.50

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రజలు రూ.50, రూ.100, రూ.200 నోట్లను ఇళ్లలో ఎందుకు దాచుకుంటున్నారు? తెలిస్తే మీరు అలాగే చేస్తారు
Asianet News Telugu15 Aug 2026
ప్రజలు రూ.50, రూ.100, రూ.200 నోట్లను ఇళ్లలో ఎందుకు దాచుకుంటున్నారు? తెలిస్తే మీరు అలాగే చేస్తారు

ఇండియాలో వచ్చిన డిజిటల్ విప్లవం ప్రజల ఆర్థిక అలవాట్లను పూర్తిగా మార్చేసింది. గతంలో జేబులో, పర్సులో డబ్బులు లేకుంటే బయటకు వెళ్లేవారు కాదు... కానీ ఇప్పుడు రూపాయి లేకున్నా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుగుతున్నారు. ప్రతి దగ్గరా డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు... కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతోంది. ఒక్కరూపాయి నుండి లక్ష రూపాయల వరకు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపిఐ యాప్స్... ఇంతకంటే ఎక్కువ డబ్బులు అవసరం అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారు. దీంతో డబ్బులు వెంటపెట్టుకుని తిరిగే అవసరం లేకుండా పోయింది. అయితే ఇటీవల కాలంలో ఓ కొత్త ట్రెండ్ ప్రారంభమయ్యింది. దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నా చాలామంది ఇళ్లలో రూ.50, రూ.100, రూ.200 వంటి కరెన్సీ నోట్లను ఎక్కువగా నిల్వ ఉంచుకుంటున్నారని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతో చిన్న నోట్లకు బాగా డిమాండ్ ఏర్పడుతోందట. ఇంతకూ డిజిటల్ పేమెంట్స్ జోరుగా సాగుతున్న సమయంలా ఇండియన్స్ మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు చిన్న నోట్లను ఎందుకు దాచుతున్నారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు ఆర్థిక నిపుణులు చెప్పే కారణాలు ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న దాడులు, అంతకుముందు రష్యా-ఉక్రెయిన్ యుద్దం, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దూకుడు నిర్ణయాలు... ఇలా వరల్డ్ ఎకానమీని ప్రభావితం చేసేలా పరిస్థితులు ఉన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. అందుకే కొంత నగదు దాచుకోవడం మంచిదనే అభిప్రాయం భారతీయుల్లో ఏర్పడింది.. ఏదైనా ఊహించని పరిణామాలు జరిగితే ఉపయోగపడాయని భావిస్తున్నారట. ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు... ఒక్కసారిగా తారుమారు అవుతాయనే జీవిత పాఠాన్ని కరోనా మహమ్మారి నేర్పింది. అందుకే కరోనా తర్వాత ప్రజల ఆర్థిక అలవాట్లు మారినట్లు నిపుణులు చెబుతున్నారు. ఊహించని పరిస్థితుల్లో బ్యాంకింగ్ సేవలు లేదా ఇంటర్నెట్‌కు అంతరాయం కలిగితే, చేతిలో ఉన్న నగదు ఉపయోగపడుతుందని